Homeగాసిప్స్యంగ్ హీరోపై ఇంత బడ్జెట్ అంటే రిస్క్ ఏమో?

యంగ్ హీరోపై ఇంత బడ్జెట్ అంటే రిస్క్ ఏమో?

యంగ్ హీరోపై ఇంత బడ్జెట్ అంటే రిస్క్ ఏమో?
యంగ్ హీరోపై ఇంత బడ్జెట్ అంటే రిస్క్ ఏమో?

యంగ్ హీరో నిఖిల్ గతేడాది అర్జున్ సురవరం సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి తిరిగి ఫామ్ ను అందుకున్నాడు. వరస ప్లాపుల నుండి బయటపడ్డ నిఖిల్ ఈ విజయంతో తిరిగి కాన్ఫిడెన్స్ ను సంపాదించుకున్నాడు. అదే ఉత్సాహంతో ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కార్తికేయ 2 ను మొదలుపెట్టాడు. నిఖిల్ కెరీర్ లో కార్తికేయ మేజర్ హిట్ గా చెప్పవచ్చు. అదే తన కెరీర్ ను టర్న్ చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ ను ఎప్పటినుండో అనుకుంటున్నా ఎందుకో కుదర్లేదు. అయితే ఈ ఏడాది ఆరంభంలో కార్తికేయ 2 కు ముహూర్తం కుదిరింది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కార్తికేయకు కొనసాగింపుగా కాకుండా దానికి సీక్వెల్ తరహాలో ఉంటుందని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.

ఇక లాంచ్ అప్పుడు విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా గురించిన తాజా సమాచారం ఏమిటంటే కార్తికేయ2 కు దాదాపు 25 కోట్లపైన బడ్జెట్ ను అనుకుంటున్నారట. నిఖిల్ మార్కెట్ రేంజ్ కు ఇది పెద్ద అమౌంట్ అనే చెప్పాలి. దానికి తోడు ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఇండస్ట్రీ భారీగా నష్టపోయింది. దీన్నుండి కోలుకోవాలంటే కచ్చితంగా బడ్జెట్ లు తగ్గించుకోవాలి. అయితే సినిమా కాన్సెప్ట్ పరంగా ఈ మాత్రం ఉండాలని టీమ్ భావిస్తోంది.

- Advertisement -

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. షూటింగ్ లకు అనుమతి లభించిన వెంటనే షూటింగ్ ను మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All