Homeన్యూస్భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'కర్ణ' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కర్ణ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'కర్ణ' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కర్ణ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలు ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ సాధిస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కర్ణ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సనాతన క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై కళాధర్ కొక్కొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే స్వీయ నిర్మాణంలో హీరో గా నటిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్, టీజర్ ప్రేక్షకుల మెప్పు పొంది సినిమా పట్ల ఆసక్తి పెంచేసింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.

మోనా ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్, ఎజాస్, ప్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రశాంత్ BJ సమకూరుస్తుండగా శ్రవణ్ G కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

- Advertisement -

జూన్ 23వ తేదీన ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ‘గుడి యనక నా సామీ’ పాటను విడుదల చేయగా ప్రేక్షకాదరణ పొందింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటను విడుదల చేయడం విశేషం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ కర్ణ మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు మేకర్స్.

నటీనటులు: కళాధర్ కొక్కొండ, మోనా ఠాకూర్, ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్, ఎజాస్, ప్రియ

సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కళాధర్ కొక్కొండ
నిర్మాత: కళాధర్ కొక్కొండ
బ్యానర్: సనాతన క్రియేషన్స్
మ్యూజిక్: ప్రశాంత్ BJ
DOP: శ్రవణ్ G కుమార్కొరియోగ్రఫీ : కిరణ్ బండార్
ఆడియో: మధుర ఆడియో
పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All