Homeటాప్ స్టోరీస్హ్రితిక్ రోషన్ చేస్తాడేమో: నాని

హ్రితిక్ రోషన్ చేస్తాడేమో: నాని

హ్రితిక్ రోషన్ చేస్తాడేమో: నాని
హ్రితిక్ రోషన్ చేస్తాడేమో: నాని

న్యాచురల్ స్టార్ నాని ప్రేక్షకుల మనసుల్లో పదిలమైన స్థానం సంపాదించుకున్నాడు. నాని నుండి సినిమా వస్తోందంటే మినిమం గ్యారంటీ అనే భావన ఉండేది కానీ గత రెండు సినిమాలుగా నాని నిరాశపరిచాడు. వి, టక్ జగదీష్ రెండూ కూడా థియేటర్లలో విడుదల కాలేదు. ఓటిటిలో విడుదలైనా కూడా నెగటివ్ రెస్పాన్స్ నే తెచ్చుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత విడుదల కానున్న నాని చిత్రం శ్యామ్ సింగ రాయ్. డిసెంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ చిత్రం పట్ల నాని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. శ్యామ్ సింగ రాయ్ తెలుగులోనే కాక దక్షిణాది భాషల్లో విడుదలవుతోంది. తమిళ్, కన్నడ, మలయాళంలోకి డబ్ అవుతోన్న ఈ చిత్రం హిందీలో మాత్రం విడుదల కావట్లేదు. దీనిపై నాని స్పందించాడు. “శ్యామ్ సింగ రాయ్ కు ఆ స్కోప్ ఉంది. ప్యాన్ ఇండియా వైడ్ గా ఈ కథను చెప్పొచ్చు. అయితే హిందీలో రిలీజ్ చేయాలనుకోలేదు. అయితే ఈ చిత్ర కథకు నార్త్ లో కూడా రిసీవింగ్ బాగుంటుంది. చూద్దాం ఎవరైనా కథ నచ్చి రీమేక్ హక్కులు కొనుగోలు చేస్తారేమో. ఏ హ్రితిక్ రోషనో చెయ్యొచ్చు” అని నాని స్పందించాడు.

- Advertisement -

రాహుల్ సంకిట్ర్యాన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All