Homeటాప్ స్టోరీస్గాలిలో వైరస్‌ ప్రభావం ఎన్ని అడుగుల దూరం?

గాలిలో వైరస్‌ ప్రభావం ఎన్ని అడుగుల దూరం?

గాలిలో వైరస్‌ ప్రభావం ఎన్ని అడుగుల దూరం?
గాలిలో వైరస్‌ ప్రభావం ఎన్ని అడుగుల దూరం?

* కరోనా వైరస్‌ మహమ్మారి గాలి ద్వారాను వ్యాప్తి చెందుతుందని జాతీయ, అంతర్జాతీయ నివేదికలు వెల్లడించడం ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. అయితే, గాలిలో వైరస్‌ కణాలు ఎంత దూరం వ్యాప్తి చెందుతాయనే విషయంపై అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) మరోసారి స్పష్టతనిచ్చింది. వైరస్‌ సోకిన వ్యక్తినుంచి 3 నుంచి 6 అడుగులలోపు వ్యాప్తి అధికంగా ఉంటుందని.. వెంటిలేషన్ లేని ప్రాంతాల్లో ఆరు అడుగుల కంటే కాస్త ఎక్కువ దూరం వ్యాప్తికి అవకాశం ఉంటుందని అమెరికా సీడీసీ తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది.*

మూడు విధాల్లో వైరస్‌ వ్యాప్తి
వైరస్‌ సోకిన వ్యక్తులనుంచి శ్వాసించినప్పుడు వెలువడే స్వల్ప శ్వాసబిందువుల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని ఇప్పటికే వెల్లడైంది. ఇది 3 నుంచి ఆరు అడుగుల లోపల ఈ సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సీడీసీ స్పష్టంచేసింది. వైరస్‌ వ్యాప్తి మూడు విధాలుగా సీడీసీ వర్గీకరించింది.

- Advertisement -

1 అతిచిన్న శ్వాసకోస కణాలను నేరుగా పీల్చడం, 2 వైరస్‌ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు నేరుగా ఇతరుల ముక్కు, నోరు వంటి శ్లేష్మ పొరలపై వైరస్‌ కణాలు చేరడం 3. వైరస్‌తో కలుషితమైన ప్రదేశాలను నేరుగా చేతులతో తాకడం వల్ల వైరస్‌ మరొకరికి సంక్రమించే అవకాశాలను సీడీసీ విశ్లేషించింది.

వెంటిలేషన్‌ లేని ప్రాంతాల్లోనే..
శ్వాసించినప్పుడు లేదా తుమ్మడం, దగ్గడంవల్ల విడుదలయ్యే సూక్ష్మబిందువుల్లో కాస్త పెద్ద పరిమాణంలో ఉన్నవి అత్యంత తొందరగా(సెకన్ల నుంచి నిమిషాల్లోనే) నేలపై పడిపోతాయి. కానీ, అత్యంత స్వల్ప పరిమాణంలో మిగిలిపోయిన కణాలు మాత్రం ఒక్కోసారి కొన్ని నిమిషాల పాటు గాలిలోనే క్రియాశీలంగా ఉంటాయి. అవి గాలిలో ఎంత సమయం ఉంటాయనే దానిపై ఆయా ప్రాంతాల్లోని ఉష్ణోగ్రత, తేమ వంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. వైరస్‌ సోకిన వ్యక్తుల నుంచి భౌతికంగా దూరంగా ఉన్నప్ప్పుడు వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం తగ్గుతుందని సీడీసీ మరోసారి స్పష్టం చేసింది. భౌతిక దూరం ఆరు అడుగుల కన్నా ఎక్కువగా ఉంటే వైరస్‌ సంక్రమణ చాలా తక్కువగా ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా గాలి బయటకు వెళ్లలేని (వెంటిలేషన్‌) లేని ప్రాంతాల్లోనే ఎక్కువగా వ్యాప్తి ఉంటుందని వెల్లడించింది. వైరస్‌ సోకిన వ్యక్తి ఇండోర్‌ ప్రదేశాల్లో 15 నిమిషాల నుంచి కొన్ని గంటలపాటు ఉన్నట్లయితే వైరస్‌ వ్యాప్తి ఆరు అడుగుల కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇక కొన్ని కేసుల్లో వైరస్‌ సోకిన వ్యక్తి వెళ్లిన మార్గంలో వెంటనే వెళ్లిన వాళ్లలో వైరస్‌సోకే ప్రమాదం ఉంటుందని సీడీసీ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.

అందుకే మాస్కు, భౌతిక దూరాలే కీలకం..
కరోనా వైరస్‌ గాలిలోనూ వ్యాపిస్తుందని తేలిన నేపథ్యంలో మాస్కులు ధరించడం, ఆరు అడుగుల దూరం పాటించడం, సరిపడ వెంటిలేషన్‌ ఉండేటట్లు చూసుకోవడం, ఇండోర్‌ ప్రాంతాల్లో గుంపులుగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండడం కొవిడ్‌ వ్యాప్తిని నిర్మూలించడంలో ఉత్తమమైన మార్గాలు అని అమెరికా సీడీసీ మరోసారి స్పష్టం చేసింది. అంతేకాకుండా వ్యక్తిగత శుభ్రత, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో కీలకమని సూచించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All