Homeటాప్ స్టోరీస్అక్కడ డిజాస్టర్ టాక్ తో బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు

అక్కడ డిజాస్టర్ టాక్ తో బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు

అక్కడ డిజాస్టర్ టాక్ తో బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు
అక్కడ డిజాస్టర్ టాక్ తో బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు

ఏదైనా సినిమాకు హిట్ టాక్ రావడమనేది చాలా కీలకం. తొలిరోజు వచ్చిన టాక్ సినిమా ఫేట్ ను డిసైడ్ చేస్తుంది. అందుకే చాలా సినిమాలు తొలిరోజు టాక్ బాగుండాలని కోరుకుంటారు. క్రిటిక్స్ ఎవరైనా తమ సినిమాకు తక్కువ రేటింగ్స్ ఇస్తే దుమ్మెత్తిపోస్తారు. సినిమాను చంపేయకండి అంటూ ఓ రేంజ్ లో విరుచుకుపడతారు. క్రిటిక్స్ రేటింగ్ తో పాటు సోషల్ మీడియా టాక్ కూడా ఈ మధ్య చాలా ముఖ్యంగా మారింది. ఏదైనా సినిమాను ముంచేది తేల్చేది ఇవే. అయితే ప్రతిసారి క్రిటిక్స్ రేటింగ్స్ తోనే బండి నడవదు. క్రిటిక్స్ ఏకిపారేసిన సినిమాను ప్రేక్షకులు భుజానికెత్తుకొని సూపర్ హిట్ చేసిన సందర్భాలు గతంలో మనం చాలా చూసాం. రీసెంట్ గా ఇదే కోవలోకి చేరుతుంది హౌస్ ఫుల్ 4 చిత్రం

హౌస్ ఫుల్ అంటేనే సూపర్ హిట్ సిరీస్. వీటిలో పెద్దగా కథ అంటూ ఏం ఉండదు. కన్ఫ్యూజన్ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది ఈ సిరీస్. అయితే ఈ సిరీస్ లో నాలుగో చిత్రం హౌజ్ ఫుల్ 4 కు మాత్రం క్రిటిక్స్ దారుణమైన రేటింగ్స్ ఇచ్చారు. సినిమాను ఏకిపడేసారు. చాలా మంది 1 లేదా 1.5 రేటింగ్ ఇచ్చి సరిపెట్టేసారు. సోషల్ మీడియాలో టాక్ కూడా అలాగే వచ్చింది. ఈ ఏడాది విడుదలైన అత్యంత చెత్త సినిమాల్లో దీనికి కూడా స్థానం కల్పించారు. దీంతో అక్షయ్ కుమార్ కు ప్లాప్ పడిందని అంతా అనుకున్నారు. అయితే కొన్ని సినిమాలకు రేటింగ్స్ తో పనిలేదని నిరూపించింది హౌస్ ఫుల్ 4. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం చెత్త రివ్యూలు వచ్చినా దాటుకుని సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. విడుదలైన తొలిరోజు 19.08 కోట్ల రూపాయల గ్రాస్ క‌లెక్ట్ చేసిన హౌస్ ఫుల్ 4, వచ్చిన నెగెటివ్ టాక్‌ను త‌ట్టుకుని శ‌నివారం 18.8 కోట్ల రూపాయలు వ‌సూలు చేసింది. ఇక ఆదివారం 15 కోట్లతో వసూళ్లు కొంత తగ్గుముఖం పట్టాయి. ఇక సోమవారం నుండి ఈ చిత్రం పనైపోతుంది అనుకున్నారు.

- Advertisement -

కానీ అనూహ్యంగా సోమవారం హౌస్ ఫుల్ 4 దుమ్మురేపింది. శనివారం, ఆదివారం కలిపిన దానికంటే ఎక్కువగా సోమవారం వసూళ్లు వచ్చాయి. సోమవారం ఈ చిత్రం 34.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. వీక్ డేస్ లో కూడా ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అవ్వడంతో హౌస్ ఫుల్ 4 100 కోట్ల కలెక్షన్స్ దాటేసి 150 కోట్లవైపు పరుగులు పెడుతోంది. ఫుల్ రన్ లో 200 కోట్ల గ్రాస్ ను అధిగమించేలా కనిపిస్తోంది.డిజాస్టర్ టాక్ తోనే ఇంత వసూలు చేసిన ఈ చిత్రం హిట్ టాక్ వచ్చి ఉంటే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయేది అనడంలో సందేహం లేదు. దసరాకు విడుదలైన వార్ విషయంలో కూడా ఇదే జరిగింది. వార్ కు క్రిటిక్స్ చాలా తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. కానీ ఆ చిత్రం 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. వార్ సినిమా దూకుడు ముందు మన సైరా నిలవలేకపోయింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All