Homeటాప్ స్టోరీస్బట్టలిప్పి టబ్ లో కూర్చొని కత్తి పట్టింది

బట్టలిప్పి టబ్ లో కూర్చొని కత్తి పట్టింది

Hottie inside a bathtub using knife as a mirror to apply lipstickమెంటల్ పోరి కాకపోతే బట్టలిప్పి స్నానం చేయడానికి బాత్ టబ్ లోకి వెళ్లిన భామ ఒకవైపు లిప్ స్టిక్ పెట్టుకుంటూ మరోవైపు పదునైన కత్తి పట్టి తన సైకో బుద్ది చాటుకుంది కంగనా రనౌత్ . అయితే కంగనా చేస్తున్నది ఇదంతా సినిమా కోసం అంతేకాని నిజంగా కాదు సుమా ! తాజాగా ఈ భామ ” మెంటల్ హై క్యా ” చిత్రంలో నటిస్తోంది . అసలే కంగనా రనౌత్ కు కాస్త మెంటల్ అంటూ ఆమధ్య పలువురు నటీనటులు ఆమెపై ఆరోపణలు చేసారు అందుకు తగ్గట్లుగానే మెంటల్ హై క్యా అనే టైటిల్ తో సినిమా చేస్తోంది .

ఇక ఈ సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా ……… మన తెలుగు వాడే ! ప్రముఖ దర్శకుడు కే . రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి . ఇతగాడు తెలుగులో రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు , అనగనగా ఓ ధీరుడు , సైజ్ జీరో అనే చిత్రాలకు దర్శకత్వం వహించాడు అవి డిజాస్టర్ అయ్యాయి దాంతో బాలీవుడ్ బాట పట్టాడు . మరి ఈ సినిమా తోనైనా హిట్ కొడతాడా ? లేక మళ్ళీ దెబ్బ తింటాడా ? చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All