
టాలీవుడ్‌లో వెండితెరపై హిట్ పెయిర్ అనిపించుకున్న వాళ్లల్లో చాలా మంది తెర వెనుక కూడా అదే పేరుని సొంతం చేసుకున్నారు. వెండితెరమీద ప్రేమలు కురిపించి ప్రేక్షకులని సమ్మోహితుల్ని చేసిన జంటలు నిజ జీవితంలోనూ మంచి జంటలుగా పేరుని దక్కించుకుంటున్నారు. నాటి తరం హీరో సూపర్‌స్టార్ కృష్ణ – విజయనిర్మల నుంచి నేటి తరం నాగచైతన్య – సమంత వరకు వెండి తెర పెయిర్‌లుగా ఆకట్టుకున్న వారే .
కృష్ణ – విజయనిర్మల.. 1961లో వివాహం జరిగినా బాపు రూపొందించిన `సాక్షి`లో నటించిన విజయనిర్మలపై మనసు పడ్డారు సూపర్‌స్టార్. అది పెళ్లి వరకు వెళ్లింది. 1969లో విజయనిర్మలని రెండవ వివాహం చేసుకున్నారు కృష్ణ. వెండితెరపై హిట్ పెయిర్ అనిపించుకున్న ఈ జంట రియల్ లైఫ్‌లోనూ అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకున్నారు. అక్కినేని నాగార్జున – అమల జంట కూడా సిల్వర్ స్క్రీన్‌పై అన్యోన్యమైన జంటగా నిలిచారు. వీరిద్దరి కలయికలో కిరాయి దాదా, ప్రేమ యుద్ధం, నిర్ణయం, శివ వంటి చిత్రాల్లో కలిసి నటించి హిట్ పెయిర్ అనిపించుకున్నారు.
ప్రేమయుద్ధం సమయంలో ప్రేమలో పడిన ఈ జంట 1992 జూన్ 11న వివాహం చేసుకున్నారు. నాగ్‌కూ ఇది రెండవ పెళ్లే. రాజశేఖర్ – జీవిత జంట కూడా ప్రేమించి పెళ్లాడిన జంటే. `తలంబ్రాలు` సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమిగా మారి పెళ్లి వరకూ నడిచింది. 1991లోనే ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటయ్యారు. వెండితెరపై చూడముచ్చటైన జంటగా ఆకట్టుకున్న వీరు నిజ జీవితంలోనూ అదే పేరుని తెచ్చుకున్నారు. ఇక ఆ తరువాత వార్తల్లో నిలిచిన జోడీ శ్రీకాంత్ – ఊహా. `ఆమె` సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 1997లో వీరి వివాహం జరిగింది.
మహేష్ – నమ్రతల జోడీది ప్రత్యేక మైన ప్రయాణం. కేవలం ఒకే ఒక్క సినిమాతో వీరిమధ్య ప్రేమ.. అది పెల్లిదాకా వెళ్లడం, పిరాడంబరంగా ముంబైలో పెళ్లి జరగడం తెలిసిందే. మహేష్ కెరీర్ `పోకిరి` తో మలుపు తిరగడంతో నమ్రత పాత్ర చాలానే వుంది. ఇక టాలీవుడ్ యంగ్ జంట నాగచైతన్య, సమంతల ప్రమకథ కూడా ప్రత్యేకమైనదే. దాదాపు ఏడేళ్ల పాటు వీరి ప్రేమాయణం సాగి చివరికి పెళ్లి పీటలెక్కింది. వెండితెరపై మెస్మరైజ్ చేసిన ఈ జంట రియల్ లైఫ్‌లోనూ హిట్టే. తమిళ తారలు అజిత్ – షాలిని, సూర్య – జ్యోతికలదీ ఇదే వరుస. 2000 సంవత్సరంలో అజిత్ – షాలినీ, 2006లో సూర్య – జ్యోతికకి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పటికీ అదే కెమిస్ట్రీని కొనసాగిస్తున్నారు. రియల్ లైఫ్‌లోనూ హిట్ పెయిర్ అనిపించుకుంటున్నారు.