Homeటాప్ స్టోరీస్`హిట్` వీడియో అదిరిందిగా!

`హిట్` వీడియో అదిరిందిగా!

`హిట్` వీడియో అదిరిందిగా!
`హిట్` వీడియో అదిరిందిగా!

విశ్వ‌క్‌సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం `హిట్‌`. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రాన్ని కూపొందించారు. వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై హీరో నేచుర‌ల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ఫుల‌క్‌నుమాదాస్‌` చిత్రంతో హీరోగా, ద‌ర్శ‌కుడిగా ర‌చ్చ చేసిన విశ్వ‌క్‌సేన్ ఈ సినిమాతో మ‌ళ్లీ హిట్‌ని సొంతం చేసుకునేలా వున్నాడు. శైలేష్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ సినిమా స్నీక్‌పీక్ వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

4 నిమిషాల 38 సెక‌న్ల నిడివిగ‌ల ఈ వీడియోలో చూపించిన మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ స‌న్నివేశాలు, విశ్వ‌క్‌సేన్ పోలీస్ ఆఫీస‌ర్‌గా అత్యంత స‌హ‌జంగా క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌రగా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు శైలేష్ రూపొందించిన‌ట్టు క‌నిపిస్తోంది. ఓ హ‌త్య మిస్ట‌రీని ఛేదించే క్ర‌మంలో విశ్వ‌క్‌సేన్ పై చిత్రీక‌రించిన స‌న్నివేశాలు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. శైలేష్ టేకింగ్‌, హిట్ మూవీ మేకింగ్ చూస్తుంటే గౌత‌మ్ మీన‌న్ ప‌దేళ్ల క్రితం తీసిన కాప్ స్టోరీ గుర్తొస్తోంది.

- Advertisement -

రుహానీశ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్ కాబోతోంది. స‌రికొత్త క‌థ‌, క‌థ‌నాల‌ని న‌మ్ముకుని నాని చేస్తున్న ఈ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా లేదా? అన్న‌ది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ అయ్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా? న‌్యూ ఏజ్ సినిమాలకు మ‌ళ్లీ తిరుగులేద‌ని నిరూపించిన‌ట్ట‌వుతుంది. ఈ సినిమా ఊపుతో మ‌రిన్ని కొత్త త‌ర‌హా చిత్రాలు పుట్టుకొస్తాయి.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All