Homeటాప్ స్టోరీస్హిట్ మూవీ రివ్యూ

హిట్ మూవీ రివ్యూ

హిట్ మూవీ రివ్యూ
హిట్ మూవీ రివ్యూ

మూవీ రివ్యూ: హిట్
నటీనటులు: విశ్వక్ సేన్, రుహాని శర్మ తదితరులు
నిర్మాత: నాని
దర్శకత్వం: శైలేష్ కొలను
సంగీతం: వివేక్ సాగర్
విడుదల తేదీ: ఫిబ్రవరి 28, 2020
రేటింగ్: 3/5

ఫలక్ నూమా దాస్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు విశ్వక్ సేన్. ఇప్పుడు అతను హీరోగా నాని నిర్మాతగా తెరకెక్కిన చిత్రం హిట్. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందించిన ఈ సినిమా మొదటినుండి ఆసక్తిగానే అనిపించింది. ముఖ్యంగా ట్రైలర్, స్నిక్ పీక్ తో హిట్ అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ఈరోజు విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకుందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం.

- Advertisement -

కథ:
విక్రమ్ రుద్రరాజు (విశ్వక్ సేన్) తీవ్రమైన ఒత్తిడితో బాధపడే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. ఒక క్లిష్టమైన కేసును ఛేజ్ చేసిన విశ్వక్ సేన్ కు మిస్టరీ కేసు ఎదురవుతుంది. సిఐ (మురళీ శర్మ) అజాగ్రత్త వల్ల ప్రీతి అనే కిడ్నాప్ అవుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేట్ అవుతుండగానే నేహా (రుహాని శర్మ) ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ కు కిడ్నాప్ అవుతుంది. ఈ రెండు కేసులకు ఒక కామన్ లింక్ ఉందని అనుమానిస్తాడు విక్రమ్. అదే సమయంలో అభిలాష్ అనే ఆఫీసర్ ఈ కేసులో విక్రమ్ ను అనుమానిస్తాడు.

ఇక మిగిలిన కథ అంతా ప్రీతి మిస్సింగ్ కు నేహా కిడ్నాప్ కు సంబంధం ఏంటి? ఈ రెండు నేరాల వెనుక ఉన్నది ఎవరు? అసలు విక్రమ్ కు తీవ్రమైన ఒత్తిడి ఎందుకు వస్తుంటుంది.

నటీనటులు:
విశ్వక్ సేన్ ఈ సినిమాలో తన నటనతో మెప్పించాడు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రోల్ లో విశ్వక్ నటన బాగుంది. ఒకవైపు మెంటల్ స్ట్రెస్ తో బాధపడుతూనే మరోవైపు తన ప్రేమికురాలు కిడ్నాప్ ను చేధించే రోల్ లో విశ్వక్ సేన్ సరిపోయాడు. హిట్ సినిమాలో విశ్వక్ సేన్ తప్పితే మిగిలిన వాళ్లకు పెద్ద రోల్స్ ఏం రాలేదు. ఉన్నంతలో రుహాని శర్మ రోల్ బాగుంది. విశ్వక్ సేన్ తో ఆమె లవ్ ట్రాక్ బాగుంది. బ్రహ్మాజీ, భాను చందర్, మురళీ శర్మ, హరితేజ ఉన్నంతలో మెప్పించారు. మిగిలిన వాళ్లంతా మామూలే.

సాంకేతిక నిపుణులు:
శైలేష్ కొలను అందించిన కథలో మంచి పాయింట్ ఉంది. అయితే ఆ కథకు ఇంప్రెసివ్ ఎమోషనల్ యాంగిల్ ఇవ్వడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేదు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంప్రెసివ్ గా ఉండగా, సెకండ్ హాఫ్ లో మధ్యలో కొంచెం డల్ అయినా కానీ మళ్ళీ తిరిగి పుంజుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉండేలా ప్లాన్ చేయడం విశేషం. దర్శకత్వం పరంగా కూడా శైలేష్ కు మంచి మార్కులే పడతాయి.

మణికందన్ సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. ముఖ్యంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అవసరమైన విజువల్స్ ను అందించడంలో విజయవంతమయ్యాడు. వివేక్ సాగర్ కూడా చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మెప్పించాడు. ఎడిటింగ్ స్మూత్ గా ఉంది. థ్రిల్లర్ కు కావాల్సిన రేసీ స్పీడ్ చిత్రానికి ఉండేలా ఎడిటింగ్ ఉంది.

విశ్లేషణ:
హిట్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన మరో మంచి అటెంప్ట్. ఫస్ట్ హాఫ్ అంతా రేసీగా ఉండి, సెకండ్ హాఫ్ కు సరైన సెటప్ కుదిరింది. అయితే సెకండ్ హాఫ్ లో ఈ సినిమా కొంచెం డల్ అయింది. క్లైమాక్స్ కూడా వీక్ గా ఉండడం కొంత నెగటివ్ పాయింట్. మొత్తంగా చూసుకుంటే హిట్ ఎంజాయ్ చేయగల థ్రిల్లర్. ఎప్పటికప్పుడు వచ్చే ట్విస్ట్స్ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయింది. ఈ వీకెండ్ చూడదగ్గ డీసెంట్ థ్రిల్లర్ హిట్.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All