Homeటాప్ స్టోరీస్హిట్ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్

హిట్ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్

హిట్ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్
హిట్ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్

ఫలక్ నూమా దాస్ చిత్రంతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమా తర్వాత విశ్వక్ సేన్ నటించిన చిత్రం హిట్. న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా పతాకంపై హిట్ తెరకెక్కింది. గత వారం విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ అటు క్రిటిక్స్ నుండి ఇటు ప్రేక్షకుల నుండి వస్తోంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ లో స్టడీగా ఉండడం విశేషం. ఫస్ట్ వీకెండ్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకుపోయిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3.57 కోట్ల షేర్ ను సాధించింది.

హిట్ సినిమాకు వరల్డ్ వైడ్ గా దాదాపు 6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీన్ని బట్టి మొదటి వారాంతానికే దాదాపు బిజినెస్ ను రాబట్టిన ఈ చిత్రం వీక్ డేస్ లో కనుక కన్సిస్టెన్సీ మైంటైన్ చేయగలిగినట్లైతే ‘హిట్’ సూపర్ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఈరోజు నుండి ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుందో అన్నది చూడాలి.

- Advertisement -

హిట్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :

నైజాం : 2.03 కోట్లు
సీడెడ్ : 29.5 లక్షలు
గుంటూరు : 26 లక్షలు
ఉత్తరాంధ్ర : 34.5 లక్షలు
తూర్పు గోదావరి : 15 లక్షలు
పశ్చిమ గోదావరి : 15 లక్షలు
కృష్ణ : 24.5 లక్షలు
నెల్లూరు : 9.5 లక్షలు

ఆంధ్ర + తెలంగాణ : 3.57 కోట్లు

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుహాని శర్మ హీరోయిన్ గా నటించింది. మురళీ శర్మ, హరితేజ, భాను చందర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయిన విక్రమ్ రుద్రరాజు జీవితంలో అనుకోకుండా జరిగిన సంఘటనలు, ప్రీతి అనే అమ్మాయి మిస్సింగ్ కేసు ఏ తీరాలకు చేరుకుంది అన్నది హిట్ మూవీ బేసిక్ ప్లాట్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All