Homeటాప్ స్టోరీస్సినిమా కష్టాలు = దర్శకులు! సమస్య తీరుతుందా?

సినిమా కష్టాలు = దర్శకులు! సమస్య తీరుతుందా?

సినిమా కష్టాలు = దర్శకులు! సమస్య తీరుతుందా?
సినిమా కష్టాలు = దర్శకులు! సమస్య తీరుతుందా?

సినిమా అంటే ఒక కళ రంగం…దాంట్లో మొదట ముఖ్యమైనది కథ, ఆ కథ కి జీవం పొసే దర్శకులు. ఫ్లాప్ దర్శకులు అంటే మనం ఆలోచించించలేం కానీ హిట్ వచ్చిన దర్శకులు గురించి మాత్రం ఆ దర్శకులు ఏ సినిమా చేయబోతున్నారు? మా హీరోతో చేస్తే సినిమా హిట్ ఇస్తారో లేదో? అన్న ప్రశ్నలు మొత్తం కలిపి దర్శకులకి బాగా తలనొప్పిగా మారిపోతాయి.

కొంతంది అయితే మొదట చిన్న హీరోలకి హిట్లు ఇచ్చి, ఆ తర్వాత పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ ఎందుకో మన దర్శకులు ”పరుశురాం” గారికి సినిమా కష్టాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. పరశురాం గారికి సినిమా అవకాశాలు వస్తున్నాయి, సినిమాలు హిట్ అవుతున్నాయి కానీ పెద్ద హీరోల దగ్గరికి వచ్చే సరికి కథ అడ్డం తిరుగుతుంది. పరశురామ్ తీసిన సినిమాలు… యువత, ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం.

- Advertisement -

గీత గోవిందం తీసిన తర్వాత ‘మహేష్ బాబు’ గారికి కథ చెప్పారు. కథ మహేష్ బాబు గారికి చాలా బాగా నచ్చింది కానీ డేట్స్ కాలి లేవు అని ముందే చెప్పారంటా. అప్పుడు ఏమి చెప్పలేని పరశురాంగారి పరిస్థితి చూసి మనమే అర్ధం చేసుకోగలగాలి.అదే కథ ‘కొరటాల శివ’ గారికి కూడా వినిపించారు పరశురాం గారు. శివ గారికి కూడా బాగా నచ్చింది. శివ గారు కూడా జూ.ఎన్.టి.ఆర్. గారిని కానీ, మహేష్ బాబు గారిని కానీ డేట్స్ కాలిగా ఉంటే అడిగి నీకు ఛాన్స్ వచ్చేలా చేస్తా అని మాట ఇచ్చారంటా శివ గారు పరశురాం గారికీ.

మహేష్ బాబు గారేమో “సరిలేరు నీకెవ్వరూ” సినిమా బిజీ లో ఉన్నారు. సినిమా 2020 సంక్రాంతికి విడుదల అవుతుంది. జూ.ఎన్.టి.ఆర్. గారు ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా బిజీ లో ఉన్నారు. మరి చూద్దాం పరశురాం గారి కథకి పెద్ద హీరోలు కుదురుతారో? లేక ఓపిక తెచ్చుకొని ఇంకొక కథ రాసుకొని చిన్న హీరోలతో సినిమా చేస్తారో లేదో? చూద్దాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All