Homeటాప్ స్టోరీస్హిప్పీ రివ్యూ

హిప్పీ రివ్యూ

హిప్పీ రివ్యూ
నటీనటులు: కార్తికేయ , దిగంగాన , జజ్బా
సంగీతం : నివాస్ కె ప్రసన్న
నిర్మాత : కళైపులి థాను
దర్శకత్వం: టి ఎన్ కృష్ణ
రేటింగ్ : 2. 5/5
రిలీజ్ డేట్ : 6 జాన్ 2019

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం సాధించిన కార్తికేయ తాజాగా హిప్పీ అంటూ ప్రేక్షకుల ముందుకు ప్లే బాయ్ గా వస్తున్నాడు. కళైపులి ఎస్ థాను వంటి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

కథ :

హిప్పీ దేవదాస్ ( కార్తికేయ ) స్నేహ ( జజ్బా సింగ్ ) ప్రేమించుకుంటారు . అయితే స్నేహ తో లాంగ్ డ్రైవ్ కు వెళ్తున్న సమయంలో స్నేహ ఫ్రెండ్ ఆముక్త మాల్యద ( దిగంగన ) ని చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు . కట్ చేస్తే ఆముక్త మాల్యద ని ఇంప్రెస్ చేయడానికి నానారకాల ప్రయత్నాలు చేసి చివరకు స్నేహ కు గుడ్ బై చెప్పేసి ఆముక్త ని ఒప్పిస్తాడు . అయితే ఆముక్త తో ప్రేమాయణం అంత సాఫీగా సాగదు దాంతో ఆమెని వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు హిప్పీ . దాంతో అతడికి బుద్ది చెప్పడానికి ఆముక్త ఆడిన నాటకం ఏంటి ? చివరకు హిప్పీ – ఆముక్త ఒక్కటయ్యారా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలైట్స్ :

దిగంగాన గ్లామర్
కార్తికేయ
యూత్ ని ఆకట్టుకునే సన్నివేశాలు

 

డ్రా బ్యాక్స్ :

డబుల్ మీనింగ్ డైలాగ్స్
ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే అంశాలు లేకపోవడం
అడల్ట్ కంటెంట్

 

 

నటీనటుల ప్రతిభ :

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో పరిచయమైన కార్తికేయ కు మంచి పాత్ర లభించింది . తన పాత్రలో విభిన్నమైన గెటప్ లకు చాన్స్ ఉంది అలాగే యూత్ అని ఆకట్టుకునే అడల్ట్ అంశాలు కూడా ఉన్నాయి . ఇక దిగంగాన గ్లామర్ తో అలరించింది అలాగే నటన పరంగా కూడా మంచి మార్కులే కొట్టేసింది . శృంగార సన్నివేశాల్లో కూడా రెచ్చిపోయింది . జజ్బా సింగ్ కు నటించే స్కోప్ లేదు . వెన్నెల కిషోర్ ఉన్నంత సేపు నవ్వించాడు . జెడి చక్రవర్తి తన పాత్రకు న్యాయం చేసాడు .

 

సాంకేతిక వర్గం :

నిర్మాణ విలువలు బాగున్నాయి , నివాస్ సంగీతం కూడా బాగుంది , పాటలు బాగున్నాయి చూడటానికి ఇంకా బాగున్నాయి . రాజశేఖర్ రెడ్డి విజువల్స్ చాలా బాగున్నాయి . ఇక దర్శకుడు కృష్ణ విషయానికి వస్తే యూత్ ని టార్గెట్ చేసి తీసాడు . యువత బలహీనతలను క్యాష్ చేసుకునే క్రమంలో పూర్తిగా యువతకు నచ్చేలా మాత్రమే డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో హిప్పీ రూపొందించాడు .

ఓవరాల్ గా :

అడల్ట్ కంటెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ హిప్పీ

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All