Monday, December 5, 2022
Homeటాప్ స్టోరీస్సీనియ‌ర్ హీరోయిన్ లుక్ షాకిస్తోంది!

సీనియ‌ర్ హీరోయిన్ లుక్ షాకిస్తోంది!

సీనియ‌ర్ హీరోయిన్ లుక్ షాకిస్తోంది!
సీనియ‌ర్ హీరోయిన్ లుక్ షాకిస్తోంది!

బొద్దు గుమ్మ ఒక్క‌సారిగా స్లిమ్‌గా మారితే ఎవ‌రైనా షాక‌వ్వాల్సిందే. సీనియ‌ర్ హీరోయిన్ రాశి అలాంటి షాక్‌నే ఇచ్చింది. జ‌గ‌ప‌తిబాబుతో శుభాకాంక్ష‌లు,  ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో `గోకులంలో సీత‌` వంటి హిట్ చిత్రాల్లో న‌టించి హీరోయిన్‌గా క్రేజ్‌ని సొంతం చేసుకున్న రాశి అప్ప‌ట్లో స్టార్ నాయిక‌గా ఓ వెలుగు వెలిగింది. ఓ యువ ద‌ర్శ‌కుడిని వివాహం చేసుకున్న త‌రువాత సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చిన రాశి ఓ పాప‌కు జ‌న్మ‌నిచ్చిన త‌రువాత మ‌రీ బొద్దుగా మారిపోయింది.

- Advertisement -

త‌ల్లి పాత్ర‌ల‌తో మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన రాశి 2017 లో వ‌చ్చిన `లంక‌` సినిమా త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లో క‌నిపించ‌లేదు. ఆ చిత్రాన్ని ఆమే నిర్మించింది. కానీ ఆశించిన ఫ‌లితం ద‌క్క‌పోవ‌డంతో కొంత కాలం సినిమాల‌కు దూరంగా వుంది. తాజాగా స‌రికొత్త లుక్‌తో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు ప్రేక్ష‌కుల‌కు రాశి షాకిస్తోంది. బొద్దుగా వుండే రాశి ఉన్న‌ట్టుండి  స్లిమ్‌గా, నాజూగ్గా త‌యారై ఫొటోల‌కు పోజులివ్వ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

రాశి విజ‌న్స్ బ్యాన‌ర్‌పై ఆమె స్వ‌యంగా న‌టిస్తూ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర కోసం రాశి స్లిమ్ ‌గా మార‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఐయామ్ బ్యాక్ అంటూ పోలీస్ ఆఫీస‌ర్ గెట‌ప్‌లో రాశి క‌నిపిస్తున్న స్టిల్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts