Homeటాప్ స్టోరీస్ప్రముఖ నటి గీతాంజలి కన్నుమూత !!!

ప్రముఖ నటి గీతాంజలి కన్నుమూత !!!

ప్రముఖ నటి గీతాంజలి కన్నుమూత !!!
ప్రముఖ నటి గీతాంజలి కన్నుమూత !!!

ప్రముఖ సీనియర్ నటి గీతాంజలి తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆమె చనిపోయారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషాల్లో ఆమె నటించారు. సీతారామకల్యాణం, మర్యాదరామన్న, లేతమనసులు, మురళీ కృష్ణ వంటి పలు మంచి చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. జానపద చిత్రాల్లో పద్మనాభం వంటి నటుల సరసన నటించిన ఘనత ఆమెది. ఆమె తన సహ నటుడు రామకృష్ణను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె అనేక సినిమాల్లో భామ క్యారెక్టర్లతో తెలుగు ప్రేక్షకులను పలకరించే వారు. పెళ్లైన కొత్తలో కీలక ప్రాతలతో మెప్పించారు గీతాంజలి.

- Advertisement -

తెలుగుతో నటించిన ఆమె చిత్రాలు ప్రాచుర్యం పొందాయి. అందుచేత తమిళ్‌, మళయాళం, హిందీ చిత్రాల్లోనూ ఆమెకు అవకాశాలు వచ్చాయి. ఇతర భాషల్లో కూడా ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. సీతారామకల్యాణం, డాక్టర్‌ చక్రవర్తి, మురళీక్రిష్ణ, అబ్బాయిగారు, అమ్మాయిగారు, కాలం మారింది, సంబరాల రాంబాబు వంటి చిత్రాలు ఈమెకు మంచి పేరుతో పాటు గుర్తింపును తీసుకుని వచ్చాయి. గీతాంజలి గారికి ఓ కుమారుడు ఉన్నాడు. 1957 లో కాకినాడ లో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత గీతాంజలిగా పేరు మార్చుకున్నారు. ఇక, గీతాంజలి మృతికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts