Homeటాప్ స్టోరీస్పోరాటం ఆపేది లేదంటున్న విశాల్

పోరాటం ఆపేది లేదంటున్న విశాల్

hero vishal fight aganist digital ratesతమిళ స్టార్ హీరో విశాల్ ఫైర్ బ్రాండ్ అన్న విషయం తెలిసిందే . గతకొంత కాలంగా వేగంగా అన్ని విషయాల్లో దూసుకుపోతూ తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాడు . ఇప్పటికే నడిగర్ సంఘం , నిర్మాతల మండలి ఎన్నికల్లో విజయాలు అందుకున్న విశాల్ ఇప్పుడు క్యూబ్ , యు ఎఫ్ ఓ , పి ఎక్స్ డి ల వల్ల నిర్మాతలు ఎంతటి దోపిడీ కి గురి అవుతున్నారో తెలుసుకొని ఆ సమస్య ని పరిష్కరించేందుకు నడుం బిగించాడు .

ఇక్కడ తెలుగునాట కొద్దిరోజులు థియేటర్ లను బంద్ చేసి మమ అనిపించారు కానీ తమిళనాట మాత్రం ఊరుకునేది లేదని పోరాటం ఆపేది లేదని అంటున్నాడు విశాల్ . డిజిటల్ పరంగా రేట్లు తగ్గించకపోతే అప్పటివరకు కూడా సినిమాలను విడుదల చేసేది లేదని …… థియేటర్ లన్ని మూతపడటమే నని తేల్చి చెప్పాడు . క్యూబ్ , యు ఎఫ్ ఓ వాళ్ళు దిగి రావాల్సిందేనని , రేట్లు తగ్గించాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నాడు విశాల్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All