Homeటాప్ స్టోరీస్సింగర్ గా మారిన విజయ్ దేవరకొండ

సింగర్ గా మారిన విజయ్ దేవరకొండ

hero vijay devarakonda turned as singerయూత్ లో పిచ్చ క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ తాజాగా సింగర్ అవతారం ఎత్తాడు . ఈ హీరో నటించిన గీత గోవిందం చిత్రం కోసం గాయకుడి అవతారం ఎత్తాడు . ఇప్పటికే హీరోగా సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ రౌడీ క్లబ్ పెట్టి తనకున్న క్రేజ్ ఏంటో మరోసారి రుజువు చేసుకున్నాడు . అగ్రెసివ్ గా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న ఈ హీరో తాజాగా మరో సంచలనం కు తెరలేపాడు . ఇప్పటికే పలువురు హీరోలు పాటలు పాడి ప్రేక్షకుల మనసు గెల్చుకోగా ఆ వరుసలో ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా చేరాడు .

గీతా ఆర్ట్స్ 2 పతాకంపై తాజాగా గీత గోవిందం అనే సినిమా తెరకెక్కింది . పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . విజయ్ దేవరకొండ సరసన ఛలో భామ రష్మిక మండన నటిస్తోంది . ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న రొమాంటిక్ సంభాషణ యువత ని పిచ్చ పిచ్చగా ఆకర్షించింది దాంతో గీత గోవిందం చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి . రొమాంటిక్ మూడ్ యూత్ ని మరింతగా ఆకర్షిస్తుండగా తాజాగా విజయ్ దేవరకొండ పాడిన పాటతో మరింతగా అంచనాలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది . ఇక ఈ పాటని ఈరోజు విడుదల చేయనున్నారు . ఆగస్టు 15 న విడుదల కానున్న గీత గోవిందం పై విజయ్ దేవరకొండ చాలానే ఆశలు పెట్టుకున్నాడు .

- Advertisement -

English Title: hero vijay devarakonda turned as singer

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All