Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ కోరిక నెరవేరుతుందా ?

విజయ్ దేవరకొండ కోరిక నెరవేరుతుందా ?

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ గా అవతారం ఎత్తిన హీరో విజయ్ దేవరకొండ . పెళ్లిచూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో అనూహ్యంగా ఈ హీరో క్రేజ్ పెరిగింది . దానికి తోడు రౌడీ అనే పేరుతో గార్మెంట్స్ బిజినెస్ తో యూత్ లో మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు . దాంతో తనకు వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి మార్కెట్ ని మరింతగా పెంచుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు .

- Advertisement -

అందులో భాగంగానే డియర్ కామ్రేడ్ అనే చిత్రాన్ని కేవలం తెలుగు బాషలోనే కాకుండా తమిళ , మలయాళ , కన్నడ బాషలలో రిలీజ్ చేయబోతున్నాడు . అది ఇచ్చే ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఇంకా ప్రారంభం కానీ హీరో చిత్రాన్ని కూడా దక్షిణాది లోని నాలుగు బాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . దీని ద్వారా సౌత్ లో పెద్ద మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలనే కోరికతో ఉన్నాడు విజయ్ దేవరకొండ . ఇలా పలు చిత్రాలను ఏకకాలంలో సౌత్ లోని అన్ని బాషలలో విడుదల చేయడం ద్వారా సౌత్ ఇండియా స్టార్ అయిపోదామని భావిస్తున్నాడు . మరి ఈ హీరో కోరిక నెరవేరుతుందా ? లేక కలగానే మిగిలిపోతుందా ? చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All