Homeటాప్ స్టోరీస్వెంకటేష్ సినిమా పరిస్థితి ఏంటో ?

వెంకటేష్ సినిమా పరిస్థితి ఏంటో ?

Hero Venkatesh get success with F2ఈ సంక్రాంతి బరిలో బాలయ్య , రజనీకాంత్ , రాంచరణ్ లతో పాటుగా వెంకటేష్ కూడా పోటీ పడుతున్నాడు ఎఫ్ 2 చిత్రంతో . జనవరి 9 న బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ విడుదల అవుతోంది . జనవరి 10న రజనీకాంత్ పేట చిత్ర రిలీజ్ , ఇక జనవరి 11న ఊర మాస్ చిత్రమైన వినయ విధేయ రామ చిత్రం వస్తోంది రాంచరణ్ హీరో . వీటి తర్వాత జనవరి 12న వెంకటేష్ , వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 చిత్రం విడుదల అవుతోంది . నాలుగు భారీ చిత్రాలు నాలుగు రోజుల్లో వస్తున్నాయ్ .

ఎన్టీఆర్ బయోపిక్ కు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి , రజనీకాంత్ కు స్టార్ ఇమేజ్ ఎలాగూ ఉంది , చరణ్ – బోయపాటి కాంబినేషన్ కాబట్టి దానికి భారీ ఓపెనింగ్స్ ఉంటాయి . అయితే వెంకటేష్ నటించిన ఎఫ్ 2 పరిస్థితి ఏంటి ? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది . వెంకటేష్ ఒకప్పుడు అగ్ర హీరో కానీ ఇప్పుడు మార్కెట్ బాగా పడిపోయింది దాంతో ఈ సినిమా బాగుంది అని టాక్ వస్తేనే ప్రేక్షకులు దీనికి కూడా ఎగబడతారు లేదంటే ఈ సినిమా డీలా పడిపోవడం ఖాయం . ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి కాబట్టి మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది అన్న మాట వినిపిస్తోంది మరి .

- Advertisement -

English Title: Hero Venkatesh get success with F2

f2

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All