Homeటాప్ స్టోరీస్జగన్ అన్నకు కంగ్రాట్స్ చెప్పిన సూర్య

జగన్ అన్నకు కంగ్రాట్స్ చెప్పిన సూర్య

తమిళ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి శుభాకాంక్షలు అందజేశాడు . పదేళ్ల పాటు రాజకీయ పోరాటం చేసి ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారని అందుకనుగుణంగా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారని ఇప్పుడు జగన్ అన్నపై పెద్ద బాధ్యత ఉందని అంటున్నాడు హీరో సూర్య . జగన్ అన్న కుటుంబంతో నాకు మొదటి నుండి మంచి సంబంధాలు ఉన్నాయని ఫ్యామిలీ ఫ్రెండ్ అని అంటూ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు .

- Advertisement -

అదేసమయంలో జగన్ అన్నపై పెద్ద బాధ్యత ఉందని , ప్రజలు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అంటున్నాడు . జగన్ బంధువులు సూర్య క్లాస్ మేట్స్ కావడంతో జగన్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి . అలాగే రాజకీయంగా కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతుండటంతో సూర్య చాలా సంతోషంగా ఉన్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All