ఎస్ ఎస్ రాజమౌళి మల్టీ స్టారర్ చిత్రానికి శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే , ఊర మాస్ కి కేరాఫ్ అడ్రస్ అయిన ఎన్టీఆర్ – చరణ్ లు హీరోలు కాగా ఈ చిత్రంలో విలన్ గా మాస్ మహారాజ్ రవితేజ నటించనున్నట్లు తెలుస్తోంది . రాజమౌళి చిత్రాల్లో హీరో కంటే విలన్ క్యారెక్టర్ బలంగా ఉంటుందన్న విషయం తెలిసిందే . విలన్ క్యారెక్టర్ ఎంత బలంగా ఉంటే హీరోయిజం అంతగా పండుతుంది కాబట్టి విలన్ పాత్రకు రవితేజ ని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది . కెరీర్ ప్రారంభంలో చిన్నా చితకా పాత్రలను పోషించి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు రవితేజ అన్న విషయం అందరికీ తెలిసిందే .
బాహుబలి సిరీస్ లలో వచ్చిన రెండు చిత్రాల తర్వాత జక్కన్న చేస్తున్న కమర్షియల్ ప్రయోగం ఇది దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . అక్టోబర్ లో ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది . ఎన్టీఆర్ తో జక్కన్న మూడు సినిమాలు చేసాడు అవి మూడు కూడా పెద్ద హిట్స్ అలాగే చరణ్ తో మగధీర లాంటి ప్రభంజనం సృష్టించిన చిత్రాన్ని చేసాడు . కట్ చేస్తే ఇప్పుడు ఈ కాంబినేషన్లో వచ్చే సినిమా కమర్షియల్ సినిమాకు సరికొత్త అర్దాన్ని చెప్పడం ఖాయమని అంటున్నారు .