Homeటాప్ స్టోరీస్రామ్ ని స్మార్ట్ గా పడేశారట

రామ్ ని స్మార్ట్ గా పడేశారట

Ram Pothineni
Ram Pothineni

హీరో రామ్ వరుసగా రాముడు మంచి బాలుడు లాంటి సినిమాలు చేస్తూ పోతుండటంతో కొత్తగా ఏదైనా చేయాలనీ భావిస్తున్న తరుణంలో ఇస్మార్ట్ గా పూరి చెప్పిన క్యారెక్టర్ బాగా నచ్చిందట ఇంకేముంది వెంటనే ఒప్పేసుకున్నాడట రామ్ . దాంతో ఇస్మార్ట్ శంకర్ చిత్రం రూపొందిందని అంటున్నాడు రామ్ . నిన్న వరంగల్ లో ఇస్మార్ట్ శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది .

కాగా వరంగల్ కు తరలివెళ్ళింది చిత్ర బృందం . రామ్ తో పాటుగా హీరోయిన్ లు నిధి అగర్వాల్ , నభా నటేష్ , ఛార్మి , దర్శకులు పూరి జగన్నాధ్ తదితరులు హాజరయ్యారు ఈ వేడుకలో . ఇక ఆ సందర్బంగా రామ్ మాట్లాడుతూ పూరి చెప్పిన క్యారెక్టర్ నచ్చి ఈ సినిమా చేశాను తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని పూరి ప్లాప్ లతో సంబంధం లేదని అంటున్నాడు . వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్న పూరి కి ఛాన్స్ ఇవ్వడానికి పలువురు హీరోలు భయపడుతుండగా రామ్ మాత్రం ధైర్యం చేసి పోరాడితే పోయేదేమీ లేదన్నంట్లుగా డేట్స్ ఇచ్చాడు . ఇక తప్పు చేశాడా ? లేదా ? అన్నది ఈనెల 18 న తేలనుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All