Homeటాప్ స్టోరీస్ప్రత్యేక హోదా కావాలంటున్న నిఖిల్

ప్రత్యేక హోదా కావాలంటున్న నిఖిల్

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా రావాల్సిందేనని , అందుకు అందరూ కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిందే అని పిలుపిచ్చారు యంగ్ హీరో నిఖిల్ . అయితే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని నిఖిల్ ట్వీట్ చేయడంతో కొంతమంది అతడ్ని విమర్శించడం మొదలు పెట్టారు . నీ సినిమాలు , నీవిషయాలు చూసుకోక ఈ ప్రత్యేక హోదా నీకెందుకు ? అంటూ నిఖిల్ ని విమర్శిస్తున్నారు దాంతో వాళ్లకు కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చాడు నిఖిల్ .

కొంతమంది ఏపీ ప్రత్యేక హోదా విషయం నీకెందుకు అని ప్రశ్నిస్తున్నారు వాళ్లకు నా సమాధానం ఒక్కటే నేను తెలుగువాడిని , భారతీయుడి ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాదు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక హోదా వల్లే సత్వర అభివృద్ధి జరుగుతుంది అన్న విషయం తెలుసుకున్నాను అంటూ మరో ట్వీట్ చేసాడు నిఖిల్ . అయితే నిఖిల్ లాంటి హీరోలు ఏపీ కి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు కానీ మిగతా హీరోలు మాత్రం సైలెంట్ గా ఉన్నారు . 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All