
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరో విషాదం చోటుచేసుకుంది. హీరో నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ ఈరోజు (ఏప్రిల్ 28) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో నిఖిల్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. నిఖిల్ తండ్రి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే ‘స్పై’ టైటిట్‌తో ఇటీవల ఓ పాన్ ఇండియా సినిమాను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. వరుస ప్రాజెక్ట్స్‌తో ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తూ ముందుకు వెళుతున్న నిఖిల్‌కు పితృవియోగం కలగడం అందర్నీ షాక్ లో పడేస్తుంది. నిఖిల్ తండ్రి పేరు శ్యామ్ సిద్ధార్థ, తల్లి వీనా సిద్ధార్థ, శ్యామ్ సిద్ధార్థ కి ఇద్దరు కుమారులు (నిఖిల్, రోహిత్) ఒక కూతురు ( సోనాలి) ఉన్నారు.