Homeటాప్ స్టోరీస్విలన్ గా నటించనున్న నాని

విలన్ గా నటించనున్న నాని

Hero Nani turned as Villainహీరో నాని విలన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట . వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే నట ఎందుకంటే విలన్  పాత్ర అయినప్పటికీ నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావడంతో మరో ఆలోచన చేయకుండా విలన్ గా నటిస్తానని చెప్పాడట నాని . ఇంతకీ నాని విలన్ గా నటించేది ఎవరి సినిమాలో తెలుసా ……. తనని  హీరోగా పరిచయం చేసిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాలో .

 

- Advertisement -

అష్టా చెమ్మా చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు నాని , ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది మోహనకృష్ణ ఇంద్రగంటి కాగా ఆ తర్వాత జెంటిల్ మెన్ అనే చిత్రం కూడా చేసారు ఇద్దరూ . ఆ రెండు సినిమాలు కూడా మంచి హిట్స్ అయ్యాయి దాంతో ఈ మూడో సినిమాపై అంచనాలు పెరిగాయి . నాని విలన్ అయినప్పటికీ అతడికి జతగా అదితిరావు హైదరీ ని ఎంపిక చేసాడు దర్శకుడు .  ఇక ఈ చిత్రంలో హీరోగా  సుధీర్ బాబు నటిస్తున్నాడు .

English Title : Hero Nani turned as Villain

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All