
సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ నాని తీరు ప్రత్యేకం. అందుకే అయన్ని అంతా నేచురల్ స్టార్ అంటుంటారు. తను చేసే పనులు స్పందించే తీరు కూడా మనసుకు హత్తుకునేలా వుంటుంది. హార్ట్ టచ్చింగ్‌గా వుంటుంది. తాజాగా ఇలాంటి హార్ట్ టచ్చింగ్ పనే ఒకటి చేసి హృదయాల్ని దోచేశాడు నాని. తను హీరోగా ఎదగడం లోనూ.. ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ప్రవేశించడం వెనక అమ్మ విజయలక్ష్మి ప్రోత్సాహం వుందని చాలా సందర్భాల్లో స్పష్టం చేశాడు నాని.
తన టాలెంట్‌ని ముందు అమ్మ గుర్తించిందని, తను సినిమాల్లోకి వెళతానంటే వెన్నంటి ప్రోత్సహించిందని చాలా సందర్భాల్లో వెల్లడించారు నాని. తను చేసే పాత్రలు మరింత నేచురల్‌గా వుంటాయంటే అది తనపై వున్న అమ్మ ప్రభావమేనని నాని చాలా సందర్భాల్లో వెల్లడించారు. అమ్మ పుట్టిన రోజున ఈ బుధవారం జరిగింది.
ఈ సందర్భంగా తన తల్లి విజయలక్ష్మీ పాదాలకు నమస్కరించి నాని ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ ఫొటోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ` అని క్యాపషన్ ఇచ్చి ఆ ఫొటోని ఇన్ స్టా వేదికగా షేర్ చేశాడు నాని. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే టాలీవుడ్‌లో హీరో నానికున్న క్రేజ్ గురించి తెలిసిందే. ఒక్కో సినిమాకు కోట్లల్లో పారితోషికం తీసుకుంటున్నా అతని తల్లి విజయలక్ష్మీ మాత్రం గత ఏడాది క్రితం వరకు వైజాగ్ లో ఉద్యోగం చేందట. డైలీ ఆర్టీసీ బస్‌లోనే ఓ సాధారణ మధ్యతరగతి మహిళగా విధులకు హాజరయ్యారట.