Homeటాప్ స్టోరీస్51 ఏళ్ల వయసులో మళ్ళీ తండ్రి అయిన హీరో

51 ఏళ్ల వయసులో మళ్ళీ తండ్రి అయిన హీరో

Hero Dileep became father again 51 ఏళ్ల వయసులో మళ్ళీ తండ్రి అయ్యాడు మలయాళ హీరో దిలీప్ . 34 ఏళ్ల హీరోయిన్ కావ్య మాధవన్ ని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు హీరో దిలీప్ . ఇక కావ్య మాధవన్ కు కూడా ఇది రెండో పెళ్లి . మొదటి భర్త కు విడాకులు ఇచ్చి హీరో దిలీప్ ని పెళ్లి చేసుకుంది . దిలీప్ – కావ్య మాధవన్ లకు కూతురు పుట్టినట్లు తెలుస్తోంది . ఇంతకూ ముందు దిలీప్ మంజు వారియర్ ని పెళ్లి చేసుకోగా ఆమెకు కూడా ఒక కూతురు దాంతో దిలీప్ కు ఇద్దరూ కూతుర్లే పుట్టారు . మలయాళ చిత్ర రంగంలో మోహన్ లాల్ , మమ్ముట్టి ల తర్వాత అంతటి స్టార్ ఈ దిలీప్ .

అయితే హీరోయిన్ భావన ని కిడ్నాప్ చేసిన , అత్యాచార ప్రయత్నం చేసిన కేసులో దిలీప్ ని అరెస్ట్ చేసి మూడు నెలలకు పైగా జైలులో వేశారు . ప్రస్తుతం ఆ కేసు విచారణ సాగుతోంది . మూడు నెలలకు పైగా జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చిన దిలీప్ ఆ కేసు నుండి బయట పడతానని అంటున్నాడు . కావ్య మాధవన్ వ్యవహారం కూడా వివాదాస్పదం అవుతూనే ఉంది . భావన కిడ్నాప్ కేసులో కావ్య మాధవన్ హస్తం కూడా ఉన్నట్లు ప్రాధమిక విచారణలో తేలింది కానీ ఇవన్నీ అసలు తీర్పు సమయానికి బలంగా ఉంటాయో లేక బలహీనం అవుతాయో చూడాలి .

- Advertisement -

English Title: Hero Dileep became father again

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All