తమిళ స్టార్ హీరో ధనుష్ సీనియర్ హీరోయిన్ తో సరసాలు ఆడనున్నాడు . ఇటీవలే మారి 2 తో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ధనుష్ తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . ఇంతకుముందు ధనుష్ – వెట్రిమారన్ ల కాంబినేషన్ లో ” పొల్లాదవన్ ”, ” ఆడుగళం ” , ” వడ చెన్నై ” చిత్రాలు రాగా ఆ మూడు కూడా మంచి విజయం సాధించాయి దాంతో ఈ నాలుగో సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి . ఈ చిత్రానికి అసురన్ అనే టైటిల్ ని పెట్టినట్లు సమాచారం.
అయితే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మలయాళ భామ మంజు వారియర్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారట . మలయాళంలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈ భామ కొంతకాలం సినిమాలను మానేసింది . కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . వయసులో ధనుష్ కంటే మంజు వారియర్ ఐదేళ్లు పెద్దది కావడం విశేషం . అయినప్పటికీ కథ డిమాండ్ మేరకు మంజు ని ఎంపిక చేశారట .
English Title: Hero Dhanush romance with senior heroine