
స్టార్ హీరో అభిమానిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనతో సెల్ఫీ తీసుకుంటున్న అభిమాని ఫోన్‌ని లాక్కుని నానా హంగామా చేశారు. ఇది చెన్నైలో ఈ రోజు జరిగింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో కోలీవుడ్ సెలబ్రిటీలు దాదాపుగా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. సాధారణ పౌరుల తరహాలోనే ఇంటి నుంచి పోలీంగ్ కేంద్రానికి బయలుదేరి క్యూ లైన్‌లో నిలబడి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
రజనీకాంత్, విక్రమ్, విజయ్, కీర్తిసురేష్ తదితరులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అందరిలాగే తమిళ సూపర్‌స్టార్ అజిత్ తన భార్య షాలినీతో కలిసి ఈ రోజు ఉదయం పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఓటు వేయడానికి భార్యతో కలిసి క్యూలో నిబడ్డారు. అయితే ఇంతలో అజిత్‌తో సెల్ఫీలు దిగడానికి అభిమానులు పోటీపడ్డారు. దీంతో అజిత్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ అభిమాని ఫోన్ ఇ కోపంగా లాక్కుని, తన వ్యక్తిగత సిబ్బందికి ఇచ్చారు. ఆ తరువాత తన చుట్టూ గుమిగూడిన అభిమానుల్ని వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించారు. తన వ్యక్తి గత సిబ్బంది వెంటనే తేరుకుని అభిమానుల్ని వెనక్కి పంపించేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు ప్రసార మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Thala #Ajith sir asks Sorry.
| Credit: Indiaglitz | #ValimaiFirstLookOnMay1st | #Valimai | #Ajithkumar | pic.twitter.com/cIEkZk7dxm
— Ajith (@ajithFC) April 6, 2021