Homeటాప్ స్టోరీస్గాడ్ ఫాదర్ : సత్యదేవ్ రూమర్స్ పై క్లారిటీ

గాడ్ ఫాదర్ : సత్యదేవ్ రూమర్స్ పై క్లారిటీ

గాడ్ ఫాదర్ : సత్యదేవ్ రూమర్స్ పై క్లారిటీ
గాడ్ ఫాదర్ : సత్యదేవ్ రూమర్స్ పై క్లారిటీ

మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న మల్టీపుల్ ప్రాజెక్ట్స్ లో ముందుగా మొదలుపెట్టిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళం సూపర్ హిట్ చిత్రం లూసిఫెర్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించనున్నాడు. మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన స్పెషల్ క్యామియోను తెలుగులో సల్మాన్ చేస్తున్నాడు. చిరు, సల్మాన్ కాంబినేషన్ లో ఒక సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో సత్యదేవ్, నయనతార నటిస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. నయనతార భర్తగా సత్యదేవ్ ప్రముఖ పాత్రలో కనిపిస్తాడు. అయితే గత కొన్ని రోజులుగా ఈ రోల్ పై పలు రూమర్స్ వస్తున్నాయి. తన భర్తగా స్టార్ నటుడ్ని ఎంపిక చేయాలని నయన్ నిర్మాతలపై ఒత్తిడి తెచ్చిందిట. అందుకే సత్యదేవ్ ను తప్పించి స్టార్ హీరో కోసం చూస్తున్నారని రూమర్స్ వచ్చాయి.

- Advertisement -

అయితే ఈ రూమర్స్ లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. నయన్ అలాంటి డిమాండ్ ఏం చేయలేదట. నయనతార, సత్యదేవ్ ఇద్దరూ కూడా జనవరి నుండి షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ఈ సినిమాను 2022 సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

తెలుగు సినిమా ఎదుగుతోంది : సత్యదేవ్

సత్యదేవ్ వెబ్ సిరీస్ కు సెకండ్ సీజన్ రెడీ

థియేటర్లలో విడుదలయ్యే మొదటి సినిమా ఇదేనా?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All