Homeరివ్యూస్హలో రివ్యూ

హలో రివ్యూ

నటీనటులు : అఖిల్ , కళ్యాణి ప్రియదర్శన్
సంగీతం : అనూప్ రూబెన్స్
నిర్మాత : అక్కినేని నాగార్జున
దర్శకత్వం : విక్రమ్ కుమార్
రేటింగ్ : 3. 25/ 5
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2017
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన చిత్రం ” హలో ”. అక్కినేని ఫ్యామిలీ కి మనం వంటి క్లాసికల్ హిట్ ని ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి . ఈరోజు రిలీజ్ అయిన హలో చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .
కథ :
అనాధ అయిన శీను  ( అఖిల్ ) జున్ను ( కళ్యాణి ప్రియదర్శన్ ) ని ప్రేమిస్తాడు చిన్నప్పుడే , జున్ను కి కూడా శీను  అంటే ఇష్టం  అయితే జున్ను డాడీ కి ఢిల్లీ ట్రాన్స్ ఫర్ కావడంతో శీను కి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళుతుంది . కట్ చేస్తే 13 ఏళ్లుగా శీను జున్ను కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు . అనాధ అయిన శీను ని ప్రకాష్ ( జగపతి బాబు ) సరోజినీ ( రమ్యకృష్ణ ) లు శీను పేరుని అవినాష్ గా మార్చి  దత్తత తీసుకుంటారు . 13 ఏళ్లుగా జున్ను కోసం ఎదురు చూస్తున్న శీను అలియాస్ అవినాష్ జున్ను ని కలిశాడా ? తన ప్రేమని గెలిపించుకున్నాడా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .
హైలెట్స్ :
అఖిల్
కళ్యాణి
ఎమోషనల్ సీన్స్
సెకండాఫ్
డ్రా బ్యాక్స్ :
స్లో నెరేషన్
నటీనటుల ప్రతిభ :
నటుడిగా అఖిల్ ఈ సినిమాతో మంచి మార్కులే కొట్టేసాడు . ఎమోషనల్ సీన్స్ లో అఖిల్ నటన కంటతడి పెట్టిస్తుంది . ఇక యాక్షన్ సీక్వెన్స్ లో చెలరేగిపోయాడు అఖిల్ . అలాగే కళ్యాణి తో రొమాంటిక్ గా నటించి భేష్ అనిపించాడు . మొత్తానికి అక్కినేని కుటుంబానికి అచ్చివచ్చిన రొమాంటిక్ ఇమేజ్ ని మరోసారి చూపించాడు …. మెప్పించాడు . ఇక హీరోయిన్ కళ్యాణి కి ఇది మొదటి సినిమానే కానీ అద్భుతంగా నటించింది అలాగే స్క్రీన్ పై మరింత అందంగా కనిపించి అందరినీ అలరించింది . జగపతి బాబు , రమ్యకృష్ణ లకు మంచి పాత్రలు లభించాయి . అజయ్ ది చిన్న పాత్రే అయినప్పటికీ ఉన్నంతలో బాగా చేసాడు .
సాంకేతిక వర్గం :
వినోద్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . అనూప్ రూబెన్స్ సంగీతం కూడా మరో హైలెట్ గా నిలిచింది హలో చిత్రానికి . యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ తరహాలో ఉండి ప్రేక్షకులను అలరించాయి . అక్కినేని నాగార్జున నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పేదేముంది , అవసరానికి మించి ఖర్చు పెట్టాడు గ్రాండియర్ కోసం . ఇక దర్శకుడు విక్రమ్ కుమార్ విషయానికి వస్తే …… సాదా సీదా కథ ని ఎంచుకున్నప్పటికీ స్క్రీన్ ప్లే పరంగా భలే మ్యాజిక్ చేసాడు విక్రమ్ . ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలను కట్ చేస్తే మొత్తం మీద హలో యూత్ ని ఆకట్టుకునేలా రూపొందించాడు .
ఓవరాల్ గా :
హలో అందరికీ నచ్చే చిత్రం
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All