
హీరో డా. రాజశేఖర్ కరోనా మహమ్మారి సోకడంతో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల ఆయన చిన్న కుమార్తె ట్విట్టర్ వేదికగా స్పందించింది. అయితే తన ట్వీట్ వైరల్ కావడం. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని ప్రచారం జరగడంతో రాజశేఖర్ ఫ్యామిలీ ఫస్త్రక్ న్యూస్ ని ప్రచారం చేయెద్దంటూ విజ్ఞప్తి చేశారు. తాజాగా రాజశేఖర్ పెద్దకుమార్తె శివానీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా వుందని పేర్కొన్నారు. `సిటీ న్యూరో సెంటర్లోని డాక్టర్ కృష్ణ నేతృత్వంలోని వైద్యుల బృందం మా నాన్నగారికి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుంది. వైద్యులు చేస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. మా తండ్రి కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు` అని శివానీ ట్వీట్ చేసింది.
ఇదిలా వుంటే సిటీ న్యూరో సెంటర్ వైద్యులు రాజశేఖర్ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల చేశారు. కరోనాతో బాధపడుతూ సిటీ న్యూరో సెంటర్ ఫర్ సర్వీస్‌లో చేరిన రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో వున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగా వుంది. వైద్యుల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోంది. రాజశేఖర్ కూడా మా టీమ్ అందిస్తున్న వైద్యానికి స్పందిస్తున్నారు. కరోనాతో బాధపడుతున్న జీవిత కోలుకున్నారు. తాజాగా చేసిన పరీక్షల్లో ఆమెకు నెగెటివ్ వచ్చింది. దీంతో ఆమెని డిశ్చార్జ్ చేశాం` అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.