Homeటాప్ స్టోరీస్మెగా హీరోకు హెచ్‌బీఓ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌!

మెగా హీరోకు హెచ్‌బీఓ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌!

మెగా హీరోకు హెచ్‌బీఓ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌!
మెగా హీరోకు హెచ్‌బీఓ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌!

వ‌రుస హిట్‌ల‌తో దూసుకుపోతున్న మెగా హీరో వ‌రుణ్ తేజ్ కొత్త చిత్రం `బాక్సర్‌` కోసం రెడీ అవుతున్నాడు. కిక్ బాక్సింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్నఈ చిత్రం ద్వారా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. సిద్దు ముద్దాతో క‌లిసి ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్ త‌న‌యుడు అల్లు వెంక‌టేష్ (బాబీ) నిర్మిస్తున్నారు. వ‌రుణ్‌తేజ్ బాక్సర్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం కోసం ప్ర‌త్యేకంగా ఓ బాక్స‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో శిక్ష‌ణ తీసుకున్నారు.

కానీ ప‌ర్‌ఫెక్ష‌న్ రాక‌పోవ‌డంతో మ‌ళ్లీ కొంత స‌మ‌యం తీసుకుని ఆ త‌రువాతే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు నెట్టాలరి మేక‌ర్స్ షూటింగ్‌ని వాయిదా వేశారు. ఇదిలా వుంటే మెగా హీరో వ‌రుణ్‌కు ప్ర‌ముఖ హెచ్‌బీఓ ఛాన‌ల్ ఓ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌ని పంపించిందట‌. డీసీ కామిక్స్‌లోని బ్యాట్‌మెన్ అంటే వ‌రుణ్‌తేజ‌కు చాలా ఇష్ట‌మ‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్నహెచ్‌బీఓ ఛాన‌ల్ వారు వ‌రుణ్‌కు స్పెష‌ల్ గిఫ్ట్‌ని ఇవ్వాల‌ని నిర్ణ‌యించార‌ట‌.

- Advertisement -

ఆలోచ‌న రాగానే డీసీ మ‌ర్చండైస్‌ని గిఫ్ట్‌గా పంపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వ‌రుణ్‌తేజ్ ఎఫ్‌2, గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకున్నారు. ఆయ‌న న‌టించ‌నున్నతాజా చిత్రం `బాక్స‌ర్‌` వ‌చ్చే నెల సెట్స్‌పైకి రాబోతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All