
క్రేజీ డైరెక్టర్ హరీష్‌శంకర్‌తో కలిసి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మరో భారీ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ నిర్మించబోతున్నారు. పవర్‌స్టార్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, హర్లే డేవిడ్‌సన్ బైక్, దానిపై గాజుల సత్యనారాయణ పెద్ద బాలశిక్ష బుక్, పక్కనే గులాబీ పువ్వు వుండటం తో పాటు ఈ సారి ఎంటర్‌టైన్‌మెంటే కాదు అంతకు మించి వుంటుందని హింట్ ఇచ్చారు హరీష్ శంకర్.
`గబ్బర్‌సింగ్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మళ్లీ వీరిద్దరి కలయికలో సినిమా అన్న న్యూస్ బయటికి రావడం, కాన్సెప్ట్ పోస్టర్ కొత్తగా వుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ పొలిటికల్ ఎంట్రీ తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఇది ఆయన రాజకీయ జీవితానికి కీలకంగా మారబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. పంచ్‌లు , ప్రాసలతో థియేటర్లన్నీ ఈ దఫా దద్దరిళ్లడం ఖాయం అని చెబుతున్నారు.
ఇదిలా వుంటే ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా పూజా హెగ్డేను ఖరారు చేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని త్వరలోనే హరీష్‌శంకర్ వెల్లడించనున్నారట. గతంలో హరీష్‌శంకర్ తెరకెక్కించిన `డీజే దువ్వాడ జగన్నాథమ్`, గద్దలకొండ గణేష్` చిత్రాల్లో పూజా హెగ్డే కీలకంగా నిలిచింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.