
మొదట “షాక్” అంటూ వచ్చాడు. కొత్త దర్శకుడు కదా,కొత్తగా ఆలోచించవచ్చు అనుకోని సినిమాకి వెళ్లారు జనాలు, నిజంగానే అందరికి షాక్ ఇచ్చింది రవితేజ సినిమా. అటు హరీష్ శంకర్ కి, రవితేజ కి కాకుండా జనాలకి కూడా బాగా షాక్ ఇచ్చింది, తర్వాత తన తదుపరి సినిమాలతో తానేంటో సత్తా చూపించాడు.
ఇక నిన్న విడుదల అయ్యింది “గద్దలకొండ గణేష్” సినిమా… సినిమా జనాల దగ్గరనుంది, పెద్ద సెలెబ్రెటీస్ వారికి అందరికి నచ్చింది. ముఖ్యంగా “వరుణ్ తేజ్” కోసం ఆడిన సినిమా ఇది. ఒకవేళ హిట్ అవ్వకపోతే హరీష్ కంటే, వరుణ్ కే చెడ్డ పేరు వచ్చేది. మంచిగా హీరో పాత్రలు చేసుకోకుండా ఎందుకు అని ప్రతి ఒక్కలూ అంటారు కాబట్టి.
మొత్తానికి హరీష్ శంకర్ కి 2 రోజులుగా నిద్ర లేని జాగారాలు చేసినందుకు మంచి ఫలితం వచ్చింది, అంతటితో ఊరుకోలేదు ఇంటర్వూస్, ప్రమోషన్స్ అంటూ బిజీ బిజీ అయిపోయాడు. తన ట్విట్టర్లో కూడా తెగ పోస్ట్స్ పెడుతూ టీం అందరికంటే అతనే తెగ సంబరపడిపోతున్నారు.
ముఖ్యంగా తనకి “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” గారి ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేసారు అని అన్నారు, ఎందుకంటే వరుణ్ తేజ్ “తొలిప్రేమ” సినిమా దగ్గరనుండి అతనిలో వాళ్ళ బాబాయి పోలికలు బాగా ఉన్నాయి అని పవన్ అభిమానులు తనకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి అందరూ హ్యాపీ అని సినిమా యూనిట్ సభ్యులు కూడా అడపాదడపా పోస్ట్స్ పెడుతున్నారు.
ఇక ఒక ఇంటర్వ్యూ లో తన తదుపరి సినిమా గురించి హరీష్ గారిని అడగగా “దాగుడుమూతలు” అని ఒక టైటిల్ తో సినిమా చేయబోతున్న్నాను అని, ఇంకొక కథ కూడా ఉంది తొందరలో మీ ముందుకి మంచి వార్తతో వస్తా అని అన్నారు. చూద్దాం రెండిట్లో ఏ కథని ముందు స్టార్ట్ చేస్తారో ?
My heart felt thanks to …. all Hero s fans for supporting us in crucial times and boosting our confidence …..??????
— Harish Shankar .S (@harish2you) September 21, 2019
Credit: Twitter