
హరిహర వీరమల్లు షూటింగ్ ఈరోజు మొదలుకాబోతుందని నిన్నటి వార్తలు వినిపించాయి. రామోజీ ఫిలిం సిటీ లో సెట్ రెడీ అయింది. కానీ షూటింగ్ మాత్రం మళ్లీ వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అది జస్ట్ వన్ డే కు వాయిదా పడిందా లేక, మరి కొన్ని రోజులా అన్నది క్లారిటీ రావాల్సి వుంది.
వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ తో వరుస బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టుకున్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే 60 శాతం వరకు పూర్తికాగా..మిగతా షూటింగ్ ను పూర్తి చేయాలనీ పవన్ ఫిక్స్ అయ్యాడు. ఈరోజు నుండి రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుపుకోవాలి..కానీ సెట్స్ పైకి వెళ్ళలేదు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ నా , లేక మరోట అనేది తెలియాల్సి ఉంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఏ ఎం రత్నం నిర్మిస్తుండగా , నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.