
వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ తో వరుస బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టుకున్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు.ఈ షెడ్యూల్ గురువారం తో పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ తెలిపారు. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలు షూట్ చేసినట్లు తెలుస్తుంది. ఇంకా కొన్ని షెడ్యూల్స్ బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం.
ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ పాత్ర యోధుడిలా రాబిన్‌హుడ్‌ను పోలి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇందులో పవన్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారట. మూడు పాత్రల్లోనూ ‘హరి హర వీరమల్లు’ పాత్రదే స్పెషల్ అట్రాక్షన్ అంటున్నారు. ఈ సినిమాలో పవన్ పాత్రలను దృష్టిలో పెట్టుకుని 30 రకాల విభిన్న దుస్తులు సిద్ధం చేసిందట చిత్ర బృందం. ప్రతి డ్రెస్ దేనికదే ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుందట. మరి పవన్‌కల్యాణ్ ఎలా కనిపిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్ర స్టోరి మొఘలుల కాలం నాటిది. కాగా, ఇందులో పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు.