
వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ తో వరుస బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టుకున్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే 50 శాతం వరకు పూర్తికాగా..మిగతా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ పూర్తయిన తరువాత పవన్ .. క్రిష్ అవుట్ పుట్ ను చూస్తున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా వదిలారు.
ఈ పిక్ చూసి పవన్ సినిమా ఫై ఎంత శ్రద్ద పెట్టాడో అంటూ కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు. ఇక ఈ మూవీ మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథ .. ఆ కాలంలో వజ్రాల దొంగతనం చేసే ఒక గజదొంగ కథ. అందువలన ఆ కాలం నాటి సెట్స్ ను భారీ స్థాయిలో వేశారు. అలా ప్రత్యేకంగా వేసిన సెట్లో ప్రస్తుతం షూటింగు చేస్తున్నారు. ఇక ఈ మూవీ లో ‘పంచమి’ అనే పాత్రలో కథానాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది. అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. వీరితో పాటు పలువురు బాలీవుడ్ నటీమణులు నటిస్తున్నారు.