Homeటాప్ స్టోరీస్ప్రొడ్యూస‌ర్‌, సీనియ‌ర్ పీఆర్వో బిఏ రాజుకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

ప్రొడ్యూస‌ర్‌, సీనియ‌ర్ పీఆర్వో బిఏ రాజుకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

ప్రొడ్యూస‌ర్‌, సీనియ‌ర్ పీఆర్వో బిఏ రాజుకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు
ప్రొడ్యూస‌ర్‌, సీనియ‌ర్ పీఆర్వో బిఏ రాజుకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ అండ్ లీడింగ్ పీఆర్వో, నిర్మాత, ప్రముఖ ఫిల్మ్ మ్యాగజైన్ `సూపర్ హిట్` అధినేత‌ బి.ఎ.రాజు  పుట్టినరోజు నేడు (జనవరి 7). ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేస్తోంది Tollywood.net , tollywood magazine. ఇండ‌స్ట్రీలో పేరున్న పీఆర్వోగా, నిర్మాత‌గా త‌న మల్టీ టాలెంటెతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు అజాత శ‌త్రువు అయ్యారు.

ఇండస్ట్రీలో వున్న చిన్న నిర్మాత, చిన్న హీరో నుంచి స్టార్ ప్రొడ్యూస‌ర్‌, స్టార్ హీరోల వ‌ర‌కు వెల్ నోటెడ్ ప‌ర్స‌న్‌గా మారిపోయారు. దివంగత ద‌ర్శ‌కురాలు, భార్య బి జయ దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలను నిర్మించి స‌క్సెస్ ఫుల్ నిర్మాత అనిపించుకున్నారు. ఆర్ జె సినిమాస్‌, సూప‌ర్ హిట్ ఫ్రెండ్స్ బ్యాన‌ర్స్‌పై చం‌టిగాడు. ప్రేమ‌లో పావ‌నీ క‌ల్యాణ్‌, ల‌వ్‌లీ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల్ని అందించారు.

- Advertisement -

మీడియాలో ప్ర‌తీ ఒక్క‌రినీ ఆప్యాయంగా ప‌ల‌క‌రించే బీఏ రాజు స్టార్ హీరోలంద‌రికీ సుప‌రిచితులే. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు వంటి అతిపెద్ద తెలుగు హీరోలలో బి.ఏ.రాజు చాలా ఇష్టపడే PRO లలో ఒకరు. ఆయ‌న పీఆర్వోగా ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు వెయ్యికి పైగా సినిమాల‌కు ప‌ని చేసి రికార్డు సాధించారు.
బా. రాజు కుమారుడు బి. శివ కుమార్ `22` పేరుతో రూపొందుతున్న‌యాక్షన్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో యువ హీరో రూపేష్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ విడుద‌ల కానుంది. ఈ రోజు పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న బి.ఏ.రాజుకు Tollywood.net , Tollywood Magazine పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ‌జేస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All