
మా ఎన్నికల సమయం దగ్గరి నుండి మంచు విష్ణు వార్తల్లో నిలుస్తున్నారు. నిత్యం వివాదాస్పద వార్తలతో మీడియా లో హాట్ టాపిక్ అవుతున్న విష్ణు..మరోసారి వైరల్ గా మారాడు. నిన్న సోమవారం ఫిలిం నగర్ ఛాంబర్ లోని తన ఆఫీస్ లో దొంగతనం జరిగిందని..తనకు సంబదించిన హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి దొంగతనానికి గురైందని , వాటి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులకు పిర్యాదు చేసారు. వీటిని తన దగ్గర పనిచేసిన నాగ శ్రీనే దొంగతనం చేసి ఉంటాడని పోలీసులకు అనుమానాలు వ్యక్తం చేయడం తో పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో తనపై వచ్చిన అనుమానాల ఫై క్లారిటీ ఇచ్చాడు నాగ శ్రీను. సోషల్ మీడియా లో నాగ శ్రీను స్పందిస్తూ..అన్యాయంగా తనపై నిందలు మోపుతున్నారని.. నేను గత పదేళ్లుగా మోహన్ బాబు, మంచు విష్ణు దగ్గర పని చేస్తున్నాను. నాకు చెప్పడానికి కూడా మాటలు రావడం లేదు.. అని జరిగిన విషయం ఏంటి అంటే అంటూ అసలు విషయం తెలిపాడు.17 వ తేదినుండి నేను వారి దగ్గర పని మానేయడం జరిగింది. ఎందుకంటే నన్ను అమ్మానా బూతులు తిట్టారు. కుల దూషణ కూడా చేశారు. బూతులు మాట్లాడి నా కులాన్ని తిట్టినందుకు నేను పని మానేశాను. ఇక నేను పని మనేసినందుకు నా మీద లేని పోనీ దొంగతనం కేసులు పెడుతున్నారు. అది చాలా అన్యాయం.. అని అన్నాడు. ఈ రోజు నన్ను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం ఏ మాత్రం న్యాయం కాదు. మీ లాంటి పెద్ద వాళ్ళని నా లాంటి నార్మల్ పర్సన్ తట్టుకోలేరు. నేను కేవలం మీ దగ్గర జాబ్ మానేసింది. మీరు తిట్టి నన్ను మోకాళ్ళ మీద నిలబెట్టి తిట్టినందుకే మానేయడం జరిగింది అని నాగ శ్రీను తెలియజేశాడు. మరి నాగ శ్రీను వ్యాఖ్యలపై మంచు విష్ణు కానీ , మంచు ఫ్యామిలీ కానీ ఎలా స్పందిస్తారనేది చూడాలి.