Homeఎక్స్ క్లూసివ్సంచలనం : బాలీవుడ్ నటుడి కాల్చివేత

సంచలనం : బాలీవుడ్ నటుడి కాల్చివేత

Haider actor saqib bilal killed in an encounter by police
Saqid bilal

బాలీవుడ్ నటుడు షకీబ్ బిలాల్( 17) ని పోలీసులు కాల్చిచంపారు . దాంతో పెను సంచలనం అయ్యింది . షాహిద్ కపూర్ హీరోగా నటించిన ” హైదర్ ” చిత్రంలో షకీబ్ బిలాల్ నటించాడు . షాహిద్ కపూర్ చిన్నప్పటి పాత్రలో షకీబ్ నటించాడు . హైదర్ చిత్రంలోని నటనకు గాను  పలువురు షకీబ్ నటనకు ప్రశంసలు కురిపించారు . అయితే బుల్లితెరపై కూడా ఇతడికి ఛాన్స్ లు వచ్చాయి అయితే ఉన్నట్లుండి నటనకు స్వస్తి చెప్పి  ఉగ్రవాదం వైపు వెళ్ళాడు .

లష్కరే తోయిబా ఉచ్చులో పడిన షకీబ్ బిలాల్ భారత్ పై ఉగ్ర దాడులకు పాల్పడటానికి శిక్షణ పొందాడట ! మరో స్నేహితుడితో కలిసి దాడులకు సిద్ధం అవుతున్నాడని తెలుసుకున్న భారత భద్రతా దళాలు కాశ్మీర్ లో బిలాల్ ఉన్న ఇంటిని చుట్టముట్టి చంపేశాయి . అయితే కాల్పుల అనంతరం మృతదేహాలను వెళ్లి చూడగా అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారట ! ఎందుకంటే హైదర్ చిత్రంలో నటించిన నటుడు షకీబ్ ఇలా ఉగ్రవాదిగా ఎలా మారాడు అంటూ ఆశ్చర్యానికి లోనౌతున్నారట . ఇక బాలీవుడ్ వర్గాలు అయితే తీవ్ర షాక్ లో ఉన్నారట .

- Advertisement -

English Title: Haider actor saqib bilal killed in an encounter by police

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All