“సీత కష్టాలు సీతవి – పీత కష్టాలు పీతవి” అని వెనక ఒక పాత సామెత ఉంది. దాన్ని సినిమా ఇండస్ట్రీ కి లింక్ చేసుకుంటే, పెద్ద ఇంట్లో పుట్టిన స్టార్స్ పిల్లలకు కూడా ఎంతో తపన,టాలెంట్ ఉంటాయి. కానీ బయట చాలా మంది స్టార్ కిడ్స్ ని విమర్శిస్తూ ఉంటారు. అలా, బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా, సొంత గుర్తింపు కోసం తపిస్తూ, కష్టపడుతూ, తనను తానూ ఎప్పటికప్పుడు కొత్తగా డిఫైన్ చేసుకునే బహుముఖ ప్రజ్ఞా శాలి రానా దగ్గుబాటి. ఒక నటుడు, ఒక హీరో, ఒక విలన్, ఒక సప్పోర్టింగ్ ఆర్టిస్ట్, ఒక యాంకర్, ఒక ప్రొడ్యూసర్ ఇలా ఎప్పటికప్పుడు ఒక కర్మయోగి లా వచ్చిన పని, నచ్చిన పని చేసుకుంటూ వెళ్తాడు రానా.
ఇప్పుడు రానా నటించిన మరొక పాన్ ఇండియా ఫిల్మ్ “హాథీ మేరే సాథీ” సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ అ టీజర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో రానా ఆదివాసి యోధుడు “బన్ దేవ్” అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఇక టీజర్ చూసినట్లయితే రానా లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ చూసి మనం ఫిదా అవ్వడం గ్యారంటీ. ఇక మరొక పాత్రలో తమిళ్ నటుడు విష్ణు విశాల్ కూడా నటిస్తున్నారు. సినిమా కథ ప్రకరం, నాగరిక మానవులు, ప్రభుత్వాలు.. అడవుల్లో ఉండే ఖనిజాల కోసం, లేదా మరేదైనా కారణాల వాళ్ళ అడవిని ఆక్రమించాని చూస్తే, ఆ అడవి బిడ్డలు ఎలా తిరగబడ్డారనేది సినిమా కథగా అనుకోవచ్చు.
ఈ సినిమా డైరెక్టర్ ప్రభు సాల్మన్ గతంలో కూడా దివంగత తమిళ దిగ్గజ నటుడు శివాజీ గణేషన్ గారి మనవడు అయిన విక్రం ప్రభు తో “కుమ్కీ” (తెలుగు లో గజరాజు) అనే సినిమా చేసారు. అది కూడా ఒక మనిషి మరియు ఏనుగు మధ్య ఉండే స్నేహం ఆధారంగా చేసిందే. ఇక మన తెలుగులో లెజెండ్ డైరెక్టర్ S.V కృష్ణ రెడ్డి, నట కిరీటి రాజేంద్రప్రసాద్ గారి కాంబినేషన్ లో వచ్చిన “రాజేంద్రుడు – గజేంద్రుడు” సినిమాను మర్చిపోవద్దు. మొత్తానికి రానా నట విశ్వరూపం ఈ సినిమాలో చూడవచ్చు. తమిళంలో “కాదన్” అనీ, తెలుగులో “అరణ్య” అనే పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు .