
బడా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గుణశేఖర్. సినిమాలను ఏళ్ల తరబడి తీస్తాడన్న పేరుంది. భారీ సెట్స్, విపరీతమైన ఖర్చు గుణశేఖర్ సినిమాల్లో చూడొచ్చు. రుద్రమదేవి తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రంతో సిద్దమయ్యాడు. ఇప్పుడు గుణశేఖర్ తన మేకింగ్ స్టైల్ ను పూర్తిగా మార్చుకున్నాడు.
కేవలం ఐదే నెలల్లో తన చిత్రాన్ని పూర్తి చేసాడు. అది కూడా కోవిడ్ ఇబ్బందుల మధ్య. అలా అని అదేమీ చిన్న చిత్రం కాదు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందించిన చిత్రం. సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ తదితరులు నటించారు. ఆ సినిమానే శాకుంతలం. మహాభారతంలోని భరత- శాకుంతల మధ్య ప్రేమ కథను బేస్ పాయింట్ గా తీసుకుని అల్లిన కథ ఇది.
కేవలం ఐదే నెలల్లో షూటింగ్ ను పూర్తి చేసారు. “ఏడాది ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పక్కాగా రెడీ అవ్వడం మూలాన ఐదు నెలల్లో శాకుంతలం చిత్రాన్ని పూర్తి చేయగలిగాం” అని గుణశేఖర్ తెలిపాడు. గుణా టీమ్ వర్క్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పిస్తున్నాడు.