Homeటాప్ స్టోరీస్గల్లీ రౌడీ మూవీ రివ్యూ

గల్లీ రౌడీ మూవీ రివ్యూ

గల్లీ రౌడీ మూవీ రివ్యూ
గల్లీ రౌడీ మూవీ రివ్యూ

మూవీ రివ్యూ: గల్లీ రౌడీ
దర్శకుడు: జి. నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు: కోన వెంకట్, ఎంవివి సత్యనారాయణ
సంగీతం: చౌరస్తా రామ్, నేహా శెట్టి, బాబీ సింహా, తదితరులు
విడుదల తేదీ: సెప్టెంబర్ 17, 2021
రేటింగ్: 2.5/5

సందీప్ కిషన్, నేహా శెట్టి, బాబీ సింహా నటించిన గల్లీ రౌడీ చిత్రానికి జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నేడు విడుదలైంది. మరి ఈ చిత్రంతో సందీప్ కిషన్ హిట్ సాధిస్తాడేమో చూద్దాం.

- Advertisement -

కథ:
వాసు (సందీప్ కిషన్) ఒక రౌడీ కావాలనే ఎదుగుతాడు. తన తాత కోరికను నెరవేర్చడం కోసం అయిష్టంగానే గల్లీ రౌడీగా మారిన వాసుకు వెంకట్ రావు (రాజేంద్ర ప్రసాద్) ప్రాపెర్టీని కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ ప్రాపెర్టీపై కన్నేస్తాడు పోలీస్ ఆఫీసర్ అయిన రఘు నాయక్ (బాబీ సింహా). మరోవైపు వెంకట్ రావు కూతురు సాహిత్య(నేహా శెట్టి)తో ప్రేమలో పడతాడు వాసు.

తర్వాత ఏం జరుగుతుంది. రఘు నాయక్ వల్ల వాసు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి? గల్లీ రౌడీ .. రౌడీ పోలీసుకు ఎలాంటి గుణపాఠం నేర్పాడు అన్నది తర్వాతి కథ.

పెర్ఫార్మన్స్:
సందీప్ కిషన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. గల్లీ రౌడీగా వంద శాతం ఎఫోర్ట్స్ పెట్టాడు సందీప్. తన ఎక్సప్రెషన్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా బాగున్నాయి. నేహా శెట్టి చూడటానికి క్యూట్ గా ఉంది. ఆమె పాత్ర లిమిటెడ్ అయినా కూడా మెప్పిస్తుంది. బాబీ సింహా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. రాజేంద్ర ప్రసాద్, వైవా హర్ష, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్ తమ పాత్రలకు తగిన న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం:
ఫస్ట్ హాఫ్ లోని కిడ్నపింగ్ డ్రామాను చాలా బాగా హ్యాండిల్ చేసారు. సినిమాటోగ్రఫీ చిత్రానికి సంబంధించి ఒకానొక హైలైట్ గా నిలుస్తుంది. బీజీఎమ్, సాంగ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు డీసెంట్. జి. నాగేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యాడు. కొన్ని కోట్ల సీన్ల డ్రాగ్ కొట్టొచ్చినట్లు తెలుస్తుంది. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టాల్సింది.

చివరిగా:
గల్లీ రౌడీ మాస్ కామెడీ ఎంటర్టైనర్. కొన్ని రొటీన్ అంశాలు చిరాకు పెడతాయి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఎంగేజింగ్ నరేషన్ ఉంటే నెక్స్ట్ లెవెల్ కు వెళ్లే అవకాశాలున్న గల్లీ రౌడీ యావరేజ్ గా నిలుస్తుంది.

రేటింగ్: 2.5/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All