చిత్రసీమ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ ర్యాపర్ 24 ఏళ్లకే మరణించడం బాలీవుడ్ లో విషాదాన్ని నింపింది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘గల్లీ బాయ్’ చిత్రం లో ర్యాప్ పాడిన ధర్మేశ్ పార్మర్ అలియాస్ ఎంసీ టాడ్ ఫాడ్ (24) మార్చ్ 21న హఠాన్మరణం చెందాడు. ఇంత చిన్న వయసులోనే చనిపోవడం తో అంత షాక్ లో పడిపోయారు. గుండె సంబంధిత కారణాలతోనే ధర్మేశ్ పార్మర్ ప్రాణాలు విడిచినట్లు తెలుస్తుంది. ముంబైలోనే అతడి అంత్యక్రియలను పూర్తి చేశారు కుటుంబ సభ్యులు.
ఈ విషయాన్ని అతడు పార్ట్‌నర్‌గా ఉన్న యూ ట్యూబ్ చానెల్ ‘స్వదేశీ’ ఖరారు చేసింది. స్వదేశీ కోసం అతడు పాడిన చివరి సాంగ్ కూడా పోస్ట్ చేసారు. గల్లీబాయ్ సినిమాలోని ‘ఇండియా 91’ పాటను టాడ్ ఫాడ్ పాడాడు. దానికి ర్యాప్ వెర్షన్‌నూ సృష్టించాడు. అది చాలా ఫేమస్ అవ్వడమే కాకుండా.. ధర్మేశ్‌కు మంచి గుర్తింపు కూడా తీసుకొచ్చింది.