Homeటాప్ స్టోరీస్శ్రీమంతుడు స్పూర్తితో పాఠశాల.. సుభాష్ రెడ్డి గారు నిజమైన హీరో: మహేష్

శ్రీమంతుడు స్పూర్తితో పాఠశాల.. సుభాష్ రెడ్డి గారు నిజమైన హీరో: మహేష్

శ్రీమంతుడు స్పూర్తితో పాఠశాల.. సుభాష్ రెడ్డి గారు నిజమైన హీరో: మహేష్
శ్రీమంతుడు స్పూర్తితో పాఠశాల.. సుభాష్ రెడ్డి గారు నిజమైన హీరో: మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. దీని కమర్షియల్ విజయాన్ని పక్కనపెడితే శ్రీమంతుడు చిత్ర కథాంశం ఎందరికో స్ఫూర్తి కలిగించేది. పుట్టిన ఊరి ఋణం తీర్చుకోవాలని చెప్పే అద్భుతమైన పాయింట్ శ్రీమంతుడులో ఉంది. ఈ చిత్రం నుండి స్ఫూర్తి పొంది చాలా మంది తమ ఊర్లలో మంచి పనులు చేయడం మనం చూసాం.

ఇప్పుడు ఈ చిత్రం స్పూర్తితో ఒక పెద్దాయన పాఠశాలనే కట్టించారు. సుభాష్ రెడ్డి అనే వ్యక్తి కామారెడ్డిలో ఒక ప్రభుత్వ పాఠశాలను తన సొంత డబ్బులతో కట్టించాడు. ఈ చర్య వెనుక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు స్ఫూర్తి అని సుభాష్ రెడ్డి తెలిపాడు.

- Advertisement -

ఈ విషయం తెలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. “ఈ పాఠశాల వెనుక శ్రీమంతుడు స్ఫూర్తి అని తెలిసాక నేను మాటలకందని విధంగా చలించాను. మేము ఇది గౌరవంగా భావిస్తున్నాం సుభాష్ రెడ్డి గారు. మీరే నిజమైన హీరో. మీలాంటి వారు మనకు ఇంకా కావాలి” అని ట్వీట్ చేసాడు.

అంతే కాకుండా ప్రాజెక్ట్ మొత్తం పూర్తయ్యాక శ్రీమంతుడు టీమ్ తో కలిసి ఆ ప్లేస్ ను సందర్శిస్తా అని తెలియజేసాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All