Homeటాప్ స్టోరీస్తెలంగాణ ఎన్నికలపై కామెంట్ చేసిన హీరోయిన్

తెలంగాణ ఎన్నికలపై కామెంట్ చేసిన హీరోయిన్

Gouthami controversial comments on telangana governmentతెలంగాణ ఎన్నికలపై కామెంట్ చేసి సంచలనం సృష్టించింది సీనియర్ హీరోయిన్ గౌతమి . తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళనాట అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది గౌతమి. రజనీకాంత్, కమల్ హాసన్, వెంకటేష్ , రాజశేఖర్ లాంటి హీరోల సరసన నటించిన గౌతమి కమల్ హాసన్ తో కొన్నాళ్ల పాటు సహజీవనం చేసింది . అయితే కమల్ తో వచ్చిన విభేదాల వల్ల అతడి నుండి విడిపోయింది కొంతకాలం క్రితం. ఆమధ్య మనమంతా చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది గౌతమి .

ఇక తెలంగాణ ఎన్నికల విషయానికి వస్తే …… ప్రజలు పరిపాలించమని ఐదేళ్లు అవకాశం ఇస్తే , ఐదేళ్ల కాలం పూర్తికాకుండానే ఎన్నికలకు వెళ్లడం సరైన చర్య కాదని కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది గౌతమి . 2014 లో ఎన్నికలు జరిగాయి , జూన్ 2 రాష్ట్రావతరణ దినోత్సవం కాబట్టి మళ్లీ ఎన్నికలు మేలోపు జరగాలి కానీ సెప్టెంబర్ లోనే శాసనసభ రద్దు చేసాడు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ . 9 నెలల ముందుగా తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నందున బోలెడు ప్రజాధనం వృధా అవుతుందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు.

- Advertisement -

English Title: Gouthami controversial comments on telangana government

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All