Homeన్యూస్మర్చిపోయిన గోపీచంద్ సినిమా మెగా హీరోకు పోటీగా

మర్చిపోయిన గోపీచంద్ సినిమా మెగా హీరోకు పోటీగా

మర్చిపోయిన గోపీచంద్ సినిమా మెగా హీరోకు పోటీగా
మర్చిపోయిన గోపీచంద్ సినిమా మెగా హీరోకు పోటీగా

యాక్షన్ సినిమాలతో పేరు తెచ్చుకున్న గోపీచంద్ రీసెంట్ గా సరైన హిట్ అన్నది చూడలేదు. నిజానికి లక్ష్యం తర్వాత ఆ స్థాయి విజయం దక్కలేదు. నెల క్రితం విడుదలైన సీటిమార్ డీసెంట్ రివ్యూలు తెచ్చుకుంది కానీ యావరేజ్ ఫలితంతోనే సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే గోపీచంద్ నుండి మరో సినిమా వస్తోంది. కొన్నేళ్ల క్రితమే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఆరడగుల బులెట్ చిత్రం ఇప్పుడు విడుదలకు ముస్తాబవుతోంది.

సీనియర్ దర్శకుడు బి. గోపాల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2017లో విడుదల కావాల్సింది పలు కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరికి 2021లో విడుదలవుతోంది. అక్టోబర్ 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అదే రోజున మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన కొండ పొలం చిత్రం విడుదలవుతోన్న విషయం తెల్సిందే.

- Advertisement -

నయనతార హీరోయిన్ గా నటించిన ఆరడుగుల బుల్లెట్ చిత్రాన్ని తాండ్ర రమేష్ నిర్మించాడు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All