
సీటిమార్ మూవీ తో హిట్ అందుకున్న హీరో గోపీచంద్ ..ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతితో పక్కా కమర్షియల్ అనే మూవీ చేస్తున్నాడు. గోపిచంద్ 29వ చిత్రంగా వస్తున్న ఈ మూవీ ఫై అభిమానుల్లో అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన పక్కా కమర్షియల్ మూవీని జులై 1 2022న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రతిరోజు పండగే లాంటి హిట్ తర్వాత కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పక్కా కమర్షియల్ సినిమాను రూపొందిస్తున్నారు మారుతి. హీరో హీరోయిన్లతో పాటు అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, సత్యారాజ్, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జకేస్ బీజాయ్ స్వరాలు సమకూరుస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్‌లో ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.