Homeటాప్ స్టోరీస్గోపీచంద్ ఫ్యామిలీ టైమ్

గోపీచంద్ ఫ్యామిలీ టైమ్

గోపీచంద్ ఫ్యామిలీ టైమ్
గోపీచంద్ ఫ్యామిలీ టైమ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కొన్ని వైరస్ ప్రభావం తో షూటింగ్ లు అన్నీ వాయిదా పడ్డాయి. ఇక ఎప్పుడు చూసినా మేకప్,కాస్ట్యూమ్,హెయిర్ స్టైల్, కేరవాన్, సీన్ పేపర్, యాక్షన్, కట్, వన్ మోర్.. ఇలా బిజీబిజీగా గడిపే మన తారలందరూ వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులతో రిలాక్స్ అవుతున్నారు. అలా… అని చెప్పి కుటుంబంతో ఎక్కడికన్నాసరదాగా బయటకి విహారయాత్రకు వెళ్దామంటే.. ప్రపంచవ్యాప్తంగా కూడా పరిస్థితులు బాలేదు.

కొంచెం పాతగా అనిపించినా కూడా అందరూ “ఇల్లే వైకుంఠం… కడుపే కైలాసం” అన్న ఫార్మెట్ కి వచ్చేశారు. చక్కగా కుటుంబ సభ్యులతో సరదాగా గడుతున్నారు.పిల్లలతో ఆడుకుంటున్నారు. హీరో గోపీచంద్ సైతం తన కుటుంబ సభ్యులతో సరదాగా అనుకోకుండా వచ్చిన ఈ బ్రేక్ ను ఎంజాయ్ చేస్తున్నారు.  గతంలో తనతో “గౌతమ్ నంద” అనే సూపర్ హిట్ సినిమా తీసిన దర్శకుడు సంపత్ నందితో కలిసి గోపీచంద్ ప్రస్తుతం “సిటీ మార్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ ఒక పల్లెటూరి కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తున్నారు.ఆయన సరసన జ్వాలా రెడ్డి అనే పాత్రలో మరొక కబడ్డీ కోచ్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నారు.

- Advertisement -

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా శాతం వరకు పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అయితే అనుకోకుండా కరోనా వైరస్ వల్ల షూటింగ్ లతో సహా అన్ని రకాల కార్యక్రమాలు వాయిదా పడ్డ నేపథ్యంలో, గోపీచంద్ తన కుటుంబంతో హోలీ పండుగ జరుపుకొని ఆ సంతోషాన్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “బయట పరిస్థితులు బాగోలేదు కాబట్టి…  చక్కగా మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో గడపండి.” అని ఫ్యాన్స్ కు గోపీ సార్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All