HomeVideosపక్కా కమర్షియల్: యాక్షన్ తో ప్యాక్ చేసిన టీజర్

పక్కా కమర్షియల్: యాక్షన్ తో ప్యాక్ చేసిన టీజర్

పక్కా కమర్షియల్: యాక్షన్ తో ప్యాక్ చేసిన టీజర్
పక్కా కమర్షియల్: యాక్షన్ తో ప్యాక్ చేసిన టీజర్

యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం పక్కా కమర్షియల్. ఇటీవలే సీటిమార్ తో యావరేజ్ హిట్ అందుకున్న గోపీచంద్, ఈ సారి పక్కా కమర్షియల్ చిత్రంతో భారీ కమర్షియల్ విజయాన్ని సాధించాలని ఫిక్స్ అయ్యాడు. సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

లాయర్ గా కనిపించనున్న గోపీచంద్ క్లాస్ గా కనిపిస్తూనే మాస్ హీరోగా ఈ చిత్రంలో నటించనున్నాడు. ఈరోజు టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో గోపీచంద్ “ఎవరికి చూపిస్తున్నారు సర్ మీ విలనిజం. మీరు ఇప్పుడు చేస్తున్నారు. నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేసాను. అలాగే నా హీరోయిజం కు ఒక ఔరా ఉంటది. కాన్సన్ట్రేట్ చేస్తే ఔరా నుండి ఒక RR వినిపిస్తోంది. ఇమేజిన్ చేసి చూసుకోండి. కిక్ యాస్ ఉంటుంది.” ఈ డైలాగ్ బాగా కనెక్ట్ అవుతోంది. గోపీచంద్ కెరీర్ లో కూడా ముందు విలన్ గా చేసి తర్వాత హీరోగా నిలదొక్కుకోవడంతో రిలేట్ చేసుకోవచ్చు.

- Advertisement -

ఇక టీజర్ విషయానికొస్తే మారుతి పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనర్ గానే దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరోసారి రాశి ఖన్నా పాత్ర హైలైట్ అయ్యే విధంగా ఉంది. జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం కూడా హైలైట్ గా ఉంది. జిఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All